Vishwaksen : మూడేళ్లు ప్రేమించా.. వదిలేసి వెళ్ళిపోయింది.. లవ్ బ్రేకప్ ని బయటపెట్టిన యువ హీరో

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇన్ స్టాగ్రామ్ సెలబ్రిటీలతో చిట్ చాట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలని తెలియచేశారు విశ్వక్ సేన్. ఈ మీటింగ్ లో...............

Vishwaksen : మూడేళ్లు ప్రేమించా.. వదిలేసి వెళ్ళిపోయింది.. లవ్ బ్రేకప్ ని బయటపెట్టిన యువ హీరో

Vishwaksen

Vishwaksen :  డిఫరెంట్ కథలు సెలక్ట్ చేసుకుంటూ తక్కువ టైంలో మంచి స్టార్ డం తెచ్చుకున్నాడు యువ హీరో విశ్వక్ సేన్. మాస్ కా దాస్ అంటూ ఓ టైటిల్ ని కూడా అప్పుడే సంపాదించేశాడు. అయితే మాస్ కే కాదు క్లాస్ కి కూడా నచ్చాలని ఇటీవల క్లాస్ సినిమాలతో వస్తున్నాడు. ప్రస్తుతం విశ్వక్ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడ్డ ఈ సినిమా మే 6న రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు విశ్వక్.

Jayamma Panchayathi : జయమ్మ కోసం ఇద్దరు అందగాళ్ళు

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇన్ స్టాగ్రామ్ సెలబ్రిటీలతో చిట్ చాట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలని తెలియచేశారు విశ్వక్ సేన్. ఈ మీటింగ్ లో ఓ వ్యక్తి సినిమాలో లవ్ బ్రేకప్ అని చెప్పే స్పెషల్ సాంగ్ కూడా వేశారు, మరి నిజ జీవితంలో మీకు లవ్, లవ్ బ్రేకప్ లాంటివి ఉన్నాయా అని అడిగాడు. దీనికి సమాధానంగా విష్వక్సేన్ మాట్లాడుతూ.. ”ఇది అందరి జీవితంలోను ఉంటుంది. నేను ఒక అమ్మాయిని మూడేళ్లు ప్రేమించాను. నేను ఇష్టపడిన అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అంతకంటే విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి వదిలేసి వెళ్లిపోయిన సంగతి నాకు నెల తర్వాత తెలిసింది. అప్పుడు చాలా బాధపడ్డాను. ఆ అమ్మాయి ఎందుకు వెళ్లిపోయిందో ఇప్పటికి తెలీదు. కానీ అదంతా గతం” అని తెలిపాడు. దీంతో ఈ యువ హీరో ప్రేమ విషాదాన్ని తెలుసుకొని నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు.