Vishwak Sen : ఆ వీడియో ప్రాంక్ కోసమే చేసాను.. పబ్లిసిటీ కోసం కాంట్రవర్సీ చేయను..

విశ్వక్సేన్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా నా కెరీర్ లోనే బెస్ట్ ఫిలిం. నేను యాక్టింగ్ చెయ్యడానికి ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. వెంకటేష్ గారు రవితేజ గారు లాగా నేను చేయగలనా..............

Vishwak Sen : ఆ వీడియో ప్రాంక్ కోసమే చేసాను.. పబ్లిసిటీ కోసం కాంట్రవర్సీ చేయను..

Vishwak

 

Vishwak Sen :  డిఫరెంట్ కథలు సెలక్ట్ చేసుకుంటూ తక్కువ టైంలో మంచి స్టార్ డం తెచ్చుకున్నాడు యువ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్. మొన్నటి దాకా మాస్ సినిమాలతో మెప్పించిన విశ్వక్ ఇప్పుడు క్లాస్ సినిమాలతో కూడా జనాల్ని ఆకట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం విశ్వక్ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ అనే సినిమాతో మే 6న ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు విశ్వక్.

 

తాజాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ దసపల్లా హోటల్లో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ మూవీ టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే నడిరోడ్డుపై ఓ యువకుడితో కలిసి ప్రాంక్ అంటూ రచ్చ రచ్చ చేశాడు విశ్వక్సేన్. ఇది బాగా వైరల్ అయి వివాదాలకు దారి తీసింది. ఈ ప్రెస్ మీట్ లో విశ్వక్ సేన్ దీనిపైన కూడా స్పందించాడు.

Hari Hara Veera Mallu: క్రేజీ అప్డేట్.. వెయ్యి మంది యోధులతో పవర్ స్టార్ ఫైట్?

విశ్వక్సేన్ మాట్లాడుతూ.. ”ఈ సినిమా నా కెరీర్ లోనే బెస్ట్ ఫిలిం. నేను యాక్టింగ్ చెయ్యడానికి ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. వెంకటేష్ గారు రవితేజ గారు లాగా నేను చేయగలనా అని భయం ఉండేది. ఈ సినిమా కోసం ముందు నేను ఆ భయాన్ని తీసేసాను. ఆ వీడియో ప్రాంక్ కోసమే చేసాము. ఈ సినిమాకు ఎక్కువ ప్రమోషన్ చేశాను. ఆ ప్రాంక్ వీడియోతో వచ్చే పబ్లిసిటీ తో థియేటర్ దగ్గరకు జనాన్ని రప్పించాలని ఉద్దేశ్యం లేదు. పబ్లిసిటీ కోసం కాంట్రవర్సీ చెయ్యను. నేను యారగెంట్ కాదు. ఈ సినిమా అందరికి నచ్చుతుంది. థియేటర్ కి వచ్చి చూడండి” అని తెలిపాడు.