VishwakSen : నన్నెవరూ ఏమి పీకలేరు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్‌సేన్..

విశ్వక్ సేన్ ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ.. ''ఎదుగుదల అంటే ఓ ప్రాబ్లం వచ్చినప్పుడు దాక్కోెవడం కాదు, దాన్ని తన్ని ఇలా ఖమ్మంలోకి వచ్చి మీతో నవ్వడం. నన్ను ఎవరో ఏదో అన్నారని........

VishwakSen : నన్నెవరూ ఏమి పీకలేరు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్‌సేన్..

Vishwaksen

VishwakSen :  ప్రస్తుతం విశ్వక్‌సేన్‌ హాట్ టాపిక్ గా మారాడు. త్వరలో రిలీజ్ కానున్న తన సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ని ప్రమోట్ చేస్తూ ఇటీవల రోడ్ మీద ఓ ప్రాంక్ వీడియో చేశాడు. ఈ వీడియోని నడిరోడ్డు మీద చేసి జనాల్ని ఇబ్బంది పెట్టడంతో నెటిజన్స్, పబ్లిక్ విశ్వక్ ని ట్రోల్ చేశారు. విశ్వక్‌సేన్‌ పై ఈ విషయంలో హెచ్చార్సీకి కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇదే విషయంపై చర్చించడానికి ఓ న్యూస్ ఛానల్ విశ్వక్‌సేన్‌ ని ఛానల్ కి పిలవగా ఆ డిబేట్ గొడవగా మారి యాంకర్, హీరో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. ఇలా మాట్లాడుతూ హీరో ఓ అసభ్యకరమైన పదంతో యాంకర్ ని దూషించాడు. దీంతో ఈ ఇష్యూ మరింత పెద్దదిగా మారింది.

ఒకపక్క ఇష్యూ రోజు రోజుకి సీరియస్ అవుతుండగా మరోవైపు విశ్వక్ సేన్ ఇవేమి పట్టించుకోకుండా తన ప్రమోషన్స్ తాను చేసుకుంటున్నాడు. తాజాగా విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖమ్మంలో నిర్వహించారు. ఈ ఈవెంట్లో విశ్వక్ సేన్ ఈ సినిమా గురించి, తన సినిమా కష్టాల గురించి మాట్లాడుతూ ప్రస్తుత ఇష్యూ మీద కూడా మాట్లాడాడు.

Vishwak Sen : విశ్వక్ అసలు హీరోనే కాదు.. చెప్పుతో కొట్టాలి.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

విశ్వక్ సేన్ ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ.. ”ఎదుగుదల అంటే ఓ ప్రాబ్లం వచ్చినప్పుడు దాక్కోెవడం కాదు, దాన్ని తన్ని ఇలా ఖమ్మంలోకి వచ్చి మీతో నవ్వడం. నన్ను ఎవరో ఏదో అన్నారని, వేలెత్తి చూపించారని నాకు బాధలేదు. కొంతమంది నాక్కూడా ఫ్యామిలీ ఉంటుందని కూడా ఆలోచించకుండా కొన్ని చేస్తున్నారు. నేనెవరికీ సమాధానం చెప్పాల్సినవసరం లేదు. నేను సమాధానం చెప్పాల్సింది మా అమ్మకి ఒక్కదానికే. అమ్మా నీకు ఒకటి చెబుతున్నా.. నీ కొడుక్కి ఏం కాదు, నన్ను ఏం పీకలేరు. నేను అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వనని అంటున్నారు. అదే నిజమైతే ఆ రోజు స్టూడియోలో అలా వచ్చి ఉండేవాడిని కాదు. నీ కొడుక్కి నువ్ నేర్పిన సంస్కారం అందరికీ తెలుసు. నాకు బ్యాక్ గ్రౌండ్ లేదు. చిన్న ఈగలాంటివాడిని, నలుగురు కలిపి కొడితే పడిపోతాను. కానీ నాకు రక్షణగా అభిమానులు మీరున్నారు. మీరు పెట్టిన మెసెజ్‌లు చేశాను. మీరే నా ఆస్తి. మిమ్మల్ని చూశాక నన్ను ఎవ్వరూ ఏం పీకలేరని అనిపించింది. ఎవడికైనా డౌట్ వస్తే హ్యాష్ ట్యాగ్ విశ్వక్ సేన్ అని కొట్టి చూడండని చెబుతాను” అని ఓ పక్క ఎమోషనల్ అవుతూనే మరో పక్క యాటిట్యూడ్ తో మాట్లాడాడు.