RRR: విజువల్ ట్రీట్.. హాట్ టాపిక్‌గా మారిన రన్ టైం..!

ర్శక ధీరుడు రాజమౌళి మరో విజువల్ ట్రీట్ సిద్ధం చేశారు. పాన్ ఇండియా స్థాయి సినిమా.. అందునా తారక్, రామ్ చరణ్ లాంటి సాలిడ్ హీరోలు.. చరిత్రను టచ్ చేసే సినిమా.. బాలీవుడ్ నుండి హాలీవుడ్..

RRR: విజువల్ ట్రీట్.. హాట్ టాపిక్‌గా మారిన రన్ టైం..!

Rrr

RRR: దర్శక ధీరుడు రాజమౌళి మరో విజువల్ ట్రీట్ సిద్ధం చేశారు. పాన్ ఇండియా స్థాయి సినిమా.. అందునా తారక్, రామ్ చరణ్ లాంటి సాలిడ్ హీరోలు.. చరిత్రను టచ్ చేసే సినిమా.. బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు తీసుకొచ్చిన నటీనటులు.. ఇదో ఇంటర్నేషనల్ ప్యాకేజీగా మార్చేసి ఆర్ఆర్ఆర్ అంచనాలను ఆకాశానికి పెంచేశాడు జక్కన్న. అందుకు తగ్గట్లే ఒక్కో అప్డేట్ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎంతగానో ఎదురుచూసేలా చేస్తున్నాయి. ఇంకా చాలదన్నట్లు ప్రొమోషన్ కూడా స్టార్ట్ చేసిన యూనిట్ అంచనాలను పీక్ స్టేజికి తీసుకెళ్తున్నాయి.

Mahesh Babu : సూపర్‌స్టార్ స్టైలిష్ లుక్

ఈరోజే ఈ సినిమా నుండి జనని సాంగ్ విడుదల చేయనున్నారు మేకర్స్. ఇది సినిమాకి ఆత్మలాంటి పాటని సాక్షాత్తు రాజమౌళి చెప్పడంతో ఈ పాట కోసం అభిమానులు గంటల కొద్ది కౌన్ డౌన్ లెక్కిస్తున్నారు. ఇదే సమయంలో ఈ సినిమా రన్ టైం మీద కూడా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు రాజమౌళి సినిమా అంటే 2 గంటల 50 నిమిషాలకి తగ్గింది లేదు. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు, భారీ క్యాస్టింగ్ కూడా ఉంటుంది కనుక ఇది అంతకు మించే ఉండడం ఖాయం అనుకున్నారు.

Meera Nandan : మలయాళీ ముద్దుగుమ్మ మీరా నందన్ బర్త్‌డే పిక్స్..

అయితే.. ఈ సినిమా మూడు గంటల నిడివికి ఫైనల్ కాపీ సిద్ధం చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్ మీద చూడడమే పండగ అనుకుంటున్న అభిమానులకు మూడు గంటల రన్ టైం మరింత ఉల్లాసంగా మారుస్తుంది. మూడు గంటల సేపు తమ అభిమానుల హీరోలను ఒకే స్క్రీన్ మీద చూడబోతున్నామనే ఉత్సుకత అభిమానులను మరింతగా ఊరిస్తుంది.