Bigg Boss 5 : బట్టలన్నీ విప్పేసిన విశ్వ.. అది కూడా తీసేయమన్న ప్రియా

దుస్తులు తొలగించే క్రమంలో విశ్వ తన ఒంటి పై ఉన్న నిక్కరు తప్ప అన్ని విప్పేశాడు. దీంతో ప్రియా అది ఎందుకు ఉంచావు. అది కూడా తీసేయ్‌ అని అనడంతో

Bigg Boss 5 : బట్టలన్నీ విప్పేసిన విశ్వ.. అది కూడా తీసేయమన్న ప్రియా

Bigg Boss

Bigg Boss 5 :  బిగ్ బాస్ 5 సీజన్ లో కొత్త కొత్త టాస్కులు ఇస్తున్నారు. టాస్క్ లో భాగంగా ఇంకో టాస్కులు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇంటిసభ్యులకు బిగ్‌బాస్‌ ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్‌ ఇచ్చాడు. రెండు రోజులుగా ఆ టాస్క్ కొనసాగుతుంది. ఇందులో అందరూ ఎక్కువ గుడ్లు కలెక్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా విశ్వకు స్పెషల్‌ పవర్‌ ఉన్న ఒక ఎల్లో గుడ్డు లభించింది. దాని ద్వారా ఐదు గుడ్లను ఈజీ గా పొందే అవకాశం లభించింది. కానీ ఆ అయిదు గుడ్లని పొందాలంటే ఇంకో టాస్క్ చేయాలన్నారు బిగ్ బాస్.

Samantha : సమంత ధాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ విచారించనున్న కోర్టు…

ఆ అయిదు గుడ్ల కోసం ఎక్కువ దుస్తులు ధరించాలనే ఒక టాస్క్‌ను ఇచ్చాడు బిగ్‌బాస్‌. అయితే విశ్వతో పాటు విశ్వ ఇంకొకరిని ఎంచుకోవాలి ఈ టాస్క్ ఆడేందుకు. దీంతో విశ్వ తనకి పోటీగా ఈ టాస్క్ ఆడేందుకు కాజల్‌ని ఎన్నుకున్నాడు. విశ్వ, కాజల్ ఇద్దరు పోటా పోటీన దుస్తులు ధరించారు. ఈ టాస్క్‌లో సన్నీ.. కాజల్‌కి హెల్ప్ చేశాడు. కాజల్ ఎక్కువ దుస్తులు వేసుకోవాలని సన్నీ ఇంటి సభ్యుల దుస్తులను కూడా పట్టుకొచ్చాడు. కానీ ఈ టాస్క్‌లో మొత్తంగా విశ్వ 106 దుస్తులు ధరిస్తే కాజల్ 79 దుస్తులు ధరించింది. టాస్క్ గెలిచి అయిదు గుడ్లని గెలుచుకున్నాడు విశ్వ. ఆ తర్వాత దుస్తులు తొలగించే క్రమంలో విశ్వ తన ఒంటి పై ఉన్న నిక్కరు తప్ప అన్ని విప్పేశాడు. దీంతో ప్రియా అది ఎందుకు ఉంచావు. అది కూడా తీసేయ్‌ అని అనడంతో ఇంటి సభ్యులంతా నవ్వేశారు.