Viswanathan Anand : బాలీవుడ్ లో చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ బయోపిక్

ఇటీవలే కలకత్తాలో జరిగిన ఒక కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న విశ్వనాథన్ ఆనంద్ తన బయోపిక్ గురించి మాట్లాడారు. మాజీ ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఈ కార్యక్రమంలో తన బయోపిక్

Viswanathan Anand : బాలీవుడ్ లో చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ బయోపిక్

Vishwanathan Anand

Viswanathan Anand :  ఇటివల కాలంలో సినీ పరిశ్రమలని బయోపిక్ లు ఏలుతున్నాయి. సినీ, క్రీడా, రాజకీయ, ఇతర రంగాల్లోని ప్రముఖుల జీవిత చరిత్రలను సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు. అన్ని సినీ పరిశ్రమలలోను ఇది జరుగుతుంది. బాలీవుడ్ లో అయితే బయోపిక్ ల జాతరే జరుగుతుంది. బాలీవుడ్లో ఇప్పటికే చాలా మంది సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల జీవిత చరిత్రలని తెరకెక్కించారు. తాజాగా మరో క్రీడా ప్రముఖుని బయోపిక్ తెరకెక్కించడానికి సిద్ధమైంది బాలీవుడ్.

Sankranthi Movies : సంక్రాంతి బిజినెస్ 1000 కోట్లు పైనే..

ఇటీవలే కలకత్తాలో జరిగిన ఒక కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న విశ్వనాథన్ ఆనంద్ తన బయోపిక్ గురించి మాట్లాడారు. మాజీ ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఈ కార్యక్రమంలో తన బయోపిక్ త్వరలోనే తెరకెక్కనుందని తెలిపారు. ఈ చిత్రంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో సంగతుల్ని తెలియచేస్తారని అన్నారు. ఇప్పటికే నా జీవిత కథను నిర్మాతతో చాలాసార్లు చెప్పానని, త్వరలో ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ప్రారంభమవుతాయని చెప్పాడు.

Bigg Boss 5 : తప్పో రైటో నాకు తెలీదు.. షణ్నుతో నేను ఇంకా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాను

అయితే ఈ బయోపిక్ లో మీ పాత్రలో ఎవరు నటించాలని కోరుకుంటున్నారు అని అడుగగా విశ్వనాథన్ దీనికి సమాధానమిస్తూ.. ఈ సినిమాలో ఎవరు నటిస్తారనేది నాకు తెలియదు. కానీ అమీర్ ఖాన్ మాత్రం నా ఛాయిస్ అని చెప్పాడు. అమీర్ అయితే ఈ నా పాత్రకి న్యాయం చేయగలదని భావిస్తున్నాను అని అన్నారు. మొత్తానికి బాలీవుడ్ లో మరో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ బయోపిక్ రానుంది.