ఫ్యాన్స్ ఫీట్స్ : కటౌట్ కూలి కిందపడ్డారు

అజిత్ కటౌట్‌కు అభిమానులు పాలాభిషేకం చేస్తుండగా, కటౌట్ ఒక్కసారిగా కూలిపోయింది.

  • Edited By: sekhar , January 10, 2019 / 11:25 AM IST
ఫ్యాన్స్ ఫీట్స్ : కటౌట్ కూలి కిందపడ్డారు

అజిత్ కటౌట్‌కు అభిమానులు పాలాభిషేకం చేస్తుండగా, కటౌట్ ఒక్కసారిగా కూలిపోయింది.

తెలుగులో సంక్రాంతికి మూడు సినిమాలు పోటీ పడుతుంటే, కోలీవుడ్‌లో మాత్రం రెండు సినిమాల మధ్య భారీ పోటీ నెలకొంది. సూపర్ స్టార్ రజినీకాంత్ పేట్టా, తళ అజిత్ విశ్వాసం సినిమాలు తమిళనాట సంక్రాంతి కానుకగా ఈరోజు (జనవరి10) బాక్సాఫీస్ బరిలోకి దిగాయి. తమిళ తంబీలు రెండు సినిమాలకూ పాజిటివ్ టాకే చెప్తున్నారు. అయినా తమ హీరో గొప్ప అంటే, తమ హీరో గొప్ప అంటూ ఫ్యాన్స్ ఘర్షణకు దిగారు. వే

లూరు సిటీలోని ఒక థియేటర్ దగ్గర రజినీ, అజిత్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ జరిగింది. ఒకరినొకరు కత్తులతో పొడుచుకున్నారు. ఇదిలా ఉంటే, విల్లుపురం దగ్గర్లోని తిరుక్కోయిలుర్ శ్రీనివాస థియేటర్ ముందు, అజిత్ కటౌట్‌కు అభిమానులు పాలాభిషేకం చేస్తుండగా, కటౌట్ ఒక్కసారిగా కూలిపోయింది. కటౌట్‌తో పాటు, పైన ఉన్న ఫ్యాన్స్ కూడా కిందపడిపోయారు. దీంతో ఆరుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని దగ్గర్లోని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి  ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.