బిగ్ బాస్ 3 విన్నర్ అతడే : వితికా షాకింగ్ కామెంట్స్

  • Published By: sreehari ,Published On : October 29, 2019 / 12:48 PM IST
బిగ్ బాస్ 3 విన్నర్ అతడే : వితికా షాకింగ్ కామెంట్స్

హీరో నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్‌కు చేరుకుంది. మరో ఐదు రోజుల్లో బిగ్ బాస్ 3 షోకు ఎండ్ కార్డు పడనుంది. పోయిన వారం శివజ్యోతి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడంతో వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా, శ్రీముఖి, బాబా భాస్కర్ మొత్తం ఐదుగురు సభ్యులు గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు. ఈ ఐదుగురిలో ఒకరు బిగ్ బాస్ విజేతగా నిలుస్తారు. ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్ బాస్ విజేత ఎవరూ అనేది పెద్ద హాట్ టాపిక్ నడుస్తోంది. 

హౌస్ సభ్యులను ప్రేక్షకులు తమ ఓట్లతో ఎవరిని గెలిపిస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో రెండు వారాల క్రితం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వితికా షేరు షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ గెలిచేది ఎవరో వితికా చెప్పేసింది. తన భర్త వరుణ్ సందేశ్ బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తాడని వితికా విశ్వాసం వ్యక్తం చేసింది. వరుణ్ తప్పక విజేతగా నిలుస్తాడనే నమ్మకం ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వితికా చెప్పుకొచ్చింది. జంటగా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్-వితికాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని, అందుకే చివరి వరకు హౌజ్ లో ఉండగలిగమని తెలిపింది. 

బిగ్ బాస్ హౌస్ లో వరుణ్ కేర్ టేకర్‌గా పేరొందిన వితికా.. తనకు వరుణ్ ఒక బేబీ లాంటి వాడిని చెప్పుకొచ్చింది. అందుకే ప్రతి విషయంలో వరుణ్ కు సలహాలు సూచనలు ఇచ్చేదానని కూడా ఎన్నోసార్లు చెబుతూ వచ్చింది. బిగ్ బాస్ విజేత ఒకరే అవుతారు కాబట్టి.. వరుణ్ ను విజేతగా నిలవాలంటే ఇద్దరూ ఉండటం సరికాదనే ఉద్దేశంతో ఆడియన్స్.. తనను ఎలిమినేట్ చేసి ఉంటారని వితికా తన మనస్సులోని అభిప్రాయాన్ని బయటపెట్టింది. బిగ్ బాస్ షో విజేతగా వరుణ్ నిలుస్తాడని, రూ. 50 లక్షల ప్రైజ్ మనీ అందుకుంటాడని వితికా ధీమా వ్యక్తం చేసింది. గెలుచుకున్న ఆ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకుంటామని వితికా తెలిపింది.

మరోవైపు చివరి వారం బిగ్ బాస్ హౌజ్ లోకి యాంకర్ సుమ అడుగుపెట్టి ఎంటర్ టైన్ మెంట్ జోడించింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులను ఇంటి సభ్యులతో చేయించింది. ఈ టాస్క్ ల్లో వరుణ్ సందేశ్ అందరిని తెగ నవ్వించి బెస్ట్ ఎంటర్ టైనర్ గా ఎంపిక అయ్యాడు. వితికా చెప్పినట్టు బిగ్‌బాస్ సీజన్ 3 విన్నర్‌గా వరుణ్ సందేశ్ నిలుస్తాడా? రూ. 50 లక్షల ప్రైజ్ మనీ గెలుస్తాడా? లేదో చూడాలి.