Vivek Ranjan Agnihotri : దసరా సినిమాతో పోలుస్తూ.. మరోసారి బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్

మొదటి మూడు నెలల్లో బాలీవుడ్ లో పఠాన్ తప్ప చెప్పుకోదగ్గ హిట్ ఏమి లేకుండా పోయింది. దీనిపై వచ్చిన ఓ బాలీవుడ్ న్యూస్ ని వివేక్ తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఓ ట్వీట్ చేశాడు.

Vivek Ranjan Agnihotri : దసరా సినిమాతో పోలుస్తూ.. మరోసారి బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్

Vivek Ranjan Agnihotri Sensational Comments on Bollywood

Vivek Ranjan Agnihotri : బాలీవుడ్(Bollywood) లో ఎప్పటినుంచో ఉన్నా కశ్మీర్ ఫైల్స్(Kashmir Files) సినిమాతో ఒక్కసారిగా ఇండియా(India) అంతా పాపులర్ అయ్యాడు డైరెక్టర్ వివేక్ రంజాన్ అగ్నిహోత్రి(Vivek Ranjan Agnihotri). బాలీవుడ్ మాఫియాపై, బాలీవుడ్ ని రూల్ చేస్తున్న కొంతమంది స్టార్స్ పై రెగ్యులర్ గా కామెంట్స్ చేస్తున్నాడు వివేక్. ఇటీవల గత కొన్నాళ్ళు బాలీవుడ్ దీన స్థితిలో ఉన్నప్పుడు వివేక్ బాలీవుడ్ పై అనేక వ్యాఖ్యలు చేసి, బాలీవుడ్ లో జరిగే విషయాలన్నీ తన ట్విట్టర్(Twitter) ద్వారా పోస్ట్ చేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ పై, బాలీవుడ్ స్టార్స్ పై అనేక సంచలన వ్యాఖ్యలు చేశాడు.

 

తాజాగా నాని దసరా సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. హిందీలో కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇదే సమయంలో హిందీలో రిలీజయిన స్టార్ హీరో అజయ్ దేవగణ్ భోళా సినిమా మాత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. మొదటి మూడు నెలల్లో బాలీవుడ్ లో పఠాన్ తప్ప చెప్పుకోదగ్గ హిట్ ఏమి లేకుండా పోయింది. దీనిపై వచ్చిన ఓ బాలీవుడ్ న్యూస్ ని వివేక్ తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఓ ట్వీట్ చేశాడు.

Nani Dasara : తెలుగు ఇండియన్ ఐడల్‌లో ధరణి ధూమ్ ధామ్ సందడి..

వివేక్ తన ట్వీట్ లో.. మళ్ళీ బాలీవుడ్ పరిస్థితి దారుణంగా ఉంది. ఓపెనింగ్‌కి కూడా గ్యారెంటీ ఇవ్వలేని స్టార్‌లకు ఊహించలేనంత ఎక్కువ రెమ్యునరేషన్స్ ఇస్తున్నారు. అలాంటి వాళ్లకు ఆ రేంజ్ లో రెమ్యునరేషన్స్ ఇవ్వడంతో బాలీవుడ్ సంతోషంగానే ఉన్నట్టు ఉంది. స్టార్స్ లైఫ్ స్టైల్ మీద సినీ నిర్మాణం వాళ్ళు ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారు. తప్పు జరుగుతుంది అని ట్వీట్ చేశాడు. అయితే ఓపెనింగ్స్ తేలేని స్టార్స్ కి కూడా ఎక్కువ రెమ్యునరేషన్స్ ఇస్తున్నారని గతంలో కరణ్ జోహార్ కూడా అన్నాడు. దీంతో ఇప్పుడు వివేక్ రంజాన్ అగ్నిహోత్రి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.