బన్నీకి వైజాగ్ ఇండిగో స్టాఫ్ సర్‌ప్రైజ్..

  • Published By: sekhar ,Published On : July 21, 2020 / 01:00 PM IST
బన్నీకి వైజాగ్ ఇండిగో స్టాఫ్ సర్‌ప్రైజ్..

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘అల వైకుంఠ‌పుర‌ములో..’ వీరి కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ చిత్ర‌మిది. బాక్సాఫీస్ వద్ద నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా కంటే ముందు త‌మ‌న్ సంగీత సార‌థ్యంలోని పాట‌లు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. లిరిక‌ల్ సాంగ్స్‌, వీడియో సాంగ్స్ ఒక్కొక్క‌టి వంద మిలియ‌న్స్ క్రాస్ చేయ‌డం విశేషం. ఈ సినిమాలో ‘‘బుట్ట‌బొమ్మ’’ సాంగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌రం లేదు. ఇప్ప‌టికే 280 మిలియ‌న్ వ్యూస్‌ను క్రాస్ చేసింది. Buttabomma songఈ పాటకు బాలీవుడ్ సెల‌బ్రిటీస్ సైతం స్టెప్పులేశారు. డేవిడ్ వార్నర్ కూడా తన భార్యతో కలిసి కాలు కదిపాడు. తాజాగా వైజాగ్‌కు చెందిన‌ ఇండిగో సిబ్బంది అల్లు అర్జున్‌కు షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. బుట్ట‌బొమ్మ సాంగ్‌కు డాన్స్ చేసి ఆ వీడియో ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసి బ‌న్నీకి ట్యాగ్ చేశారు. వీడియో చూసిన బ‌న్నీ ఇలాంటి సంతోషాన్నిచ్చే ఆశ్చర్యాన్ని తనకు కలిగించినందుకు థ్యాంక్స్ అంటూ ఇండిగో సిబ్బందికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.