VJ Sunny : ఫ్రెండ్స్ వల్లే బిగ్‌బాస్ విన్నర్ అయ్యాను.. VJ సన్నీ ‘సకల గుణాభిరామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్

బిగ్‌బాస్ 5 విన్నర్ సన్నీ హిరోగా నటించిన 'సకల గుణాభిరామ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని వెస్టిన్ హోటల్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి విశ్వక్ సేన్.......

VJ Sunny : ఫ్రెండ్స్ వల్లే బిగ్‌బాస్ విన్నర్ అయ్యాను.. VJ సన్నీ ‘సకల గుణాభిరామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Vishwaksen

Sakala Gunabhirama :  బిగ్‌బాస్ 5వ సీజన్ విన్నర్ గా నిలిచిన సన్నీ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గతంలోనే మొదలైన ఓ సినిమాని ఇప్పుడు బిగ్‌బాస్ క్రేజ్ ఉండటంతో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ‘సకల గుణాభిరామ’ అనే టైటిల్ తో సన్నీ రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు.

బిగ్‌బాస్ 5 విన్నర్ సన్నీ హిరోగా నటించిన ‘సకల గుణాభిరామ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని వెస్టిన్ హోటల్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి విశ్వక్ సేన్, అనిల్ రావిపూడి గెస్టులుగా వచ్చారు. గత సీజన్ లోని కొంతమంది బిగ్‌బాస్ కంటెస్టెంట్ లతో పాటు ఈ సీజన్ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్జే కాజల్ దీనికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అభిమానులకి ఎంట్రీ లేకపోవడంతో మీడియా ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరిగింది. కొంతమంది అభిమానులు మాత్రం వచ్చారు.

Siri-Srihan : సిరి, శ్రీహన్ విడిపోలేదు.. ఇదే సాక్ష్యం

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సన్నీ మాట్లాడుతూ.. ” బిగ్‌బాస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆందరకు ఇక్కడకి వచ్చినందుకు ధన్యవాదాలు. జీవితంలో పైసలు కాదు ఫ్రెండ్స్ ముఖ్యం. వాళ్ళ వల్లనే బిగ్‌బాస్ విన్నర్ అయ్యాను. విశ్వక్ అన్న నాకు బయట ఉండి చాలా సపోర్ట్ చేశాడు. అనిల్ రావిపూడి అన్న కూడా నాకు సపోర్ట్ చేశాడు. అందరి సపోర్ట్ ఉండబట్టే బిగ్‌బాస్ విన్నర్ అయ్యాను. మీకు ఎంత జెన్యూన్ గా బిగ్‌బాస్ లో గేమ్ ఆడి మీకు దగ్గర అయ్యానో, సినిమాలో అంతే మంచి నటనతో మీకు మరింత దగ్గర అవుతాను. ఒక మంచి సినిమా తీశాము. మీరందరూ ఆదరించాలి” అని అన్నాడు.