VJ Sunny: బిగ్‌బాస్ ఫేం విజే.సన్నీ హీరోగా ‘అన్‌స్టాపబుల్’ మూవీ ప్రారంభం!

అన్‌స్టాపబుల్‌ (నో డౌట్ 100% ఎంటర్టైన్మెంట్) A2B ఇండియా ప్రొడక్షన్ ప్రవేట్ లిమిటెడ్ నిర్మాణంలో రంజిత్ రావ్.బి నిర్మాతగా షేక్ రఫీ, బిట్టు న్యావనంది సహా నిర్మాతలుగా అద్భుతమైన హాస్య ప్రధాన....

VJ Sunny: బిగ్‌బాస్ ఫేం విజే.సన్నీ హీరోగా ‘అన్‌స్టాపబుల్’ మూవీ ప్రారంభం!

Vj Sunny Next Movie Unstoppable Launched

VJ Sunny: అన్‌స్టాపబుల్‌ (నో డౌట్ 100% ఎంటర్టైన్మెంట్) A2B ఇండియా ప్రొడక్షన్ ప్రవేట్ లిమిటెడ్ నిర్మాణంలో రంజిత్ రావ్.బి నిర్మాతగా షేక్ రఫీ, బిట్టు న్యావనంది సహా నిర్మాతలుగా అద్భుతమైన హాస్య ప్రధాన చిత్రాన్ని నిర్మించనున్నారు. రచయితగా తనదైన కామెడీ శైలిలో సీమశాస్త్రి, పాండవులు పాండవులు తుమ్మెద, పిల్లా నువ్వు లేని జీవితం, ఈడోరకం ఆడోరకం లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంభాషణలు అందించి బుర్రకథ లాంటి డిఫరెంట్ చిత్రంతో దర్శకుడిగా మారిన డైమండ్ రత్నబాబు 100% ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీతో ఈ అన్‌స్టాపబుల్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

బిగ్ బాస్ బాద్షా, మచ్ఛా అని ప్రేక్షకులు అందరూ ప్రేమగా పిలిచే విజే.సన్నీ ఈ చిత్రానికి కథానాయకుడిగా, ప్రేక్షకులను తనదైన శైలిలో నవ్వించే సప్తగిరి జిలానీ రామ్ దాస్‌గా మరిన్ని అన్‌స్టాపబుల్‌ ఎంటర్టైన్మెంట్ పాత్రల్లో పోసాని కృష్ణమురళి, పృద్వి, మణిచెందన, షకలక శంకర్, విరాన్ ముత్తమ్ శెట్టి, చమ్మక్ చంద్ర, బిత్తిరి సత్తి, ఇతర ముఖ్య పాత్రలలో వకీల్ సాబ్ ఫేమ్ లిరీష, డీజే టిల్లు ఫేమ్ మురళి గౌడ్, ఐమాక్స్ వెంకట్, సురేష్ కొండేటి, విక్రమ్ ఆదిత్య, రోని మరియు గబ్బర్ సింగ్ బ్యాచ్ నటించనున్నారు. ఈ  చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్ లో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత వి.విజయేంద్రప్రసాద్, దర్శకుడు బి.గోపాల్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హీరో తనీష్, నటుడు బిత్తిరి సత్తి తదితరులు పాల్గొన్నారు.

VJ Sunny : హరీష్ శంకర్ కథలో హీరోగా బిగ్‌బాస్ సన్నీ, హీరోయిన్‌గా దివి

రచయిత విజయేంద్ర ప్రసాద్ హీరో వి.జె సన్నీపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. దర్శకుడు బి.గోపాల్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో చిత్ర హీరో సన్నీ మాట్లాడుతూ.. దర్శకుడు డైమండ్ రత్నబాబుకు సినిమా అంటే పిచ్చి. తను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. బిగ్ బాస్ తరువాత నటుడిగా నేను ప్రూవ్ చేసుకోవాలని వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా సినిమా చేస్తున్నాను. ప్రేక్షకులను మెప్పించడానికి, నవ్వించడానికి నటుడుగా నేను 100% కష్టపడి పని చేస్తాను. రిజల్ట్ అనేది ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది. ఈ సినిమాకు త్రిమూర్తులు వంటి నిర్మాతలతో పాటు మంచి టీం దొరికారు. సీనియర్ నటులతో నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది. అలాగే దిల్ రాజు, హరీష్ శంకర్ ల బ్లెస్సింగ్ తో మరో సినిమా చేస్తున్నాను అని అన్నారు.

చిత్ర సహ-నిర్మాత రఫీ మాట్లాడుతూ.. రత్నబాబు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాకు మంచి హీరో కావాలనుకున్నప్పుడు సన్నీని సెలెక్ట్ చేసుకొన్నాము. అలాగే సీనియర్ ఆర్టిస్టులు కూడా మా సినిమాకు బాగా సెట్టయ్యారు.ఇలా సీనియర్ నటీనటులు, టెక్నీషియన్స్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఏంటర్ టైన్ చేస్తుంది అన్నారు. నటి ఆక్షా ఖాన్ మాట్లాడుతూ..ఈ సినిమా కోసం నేను చాలా ఎక్సయిటింగ్ గా ఉంది.ఇందులో ఫుల్ కామెడీ ఉంటుంది. సీనియర్స్ తో వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.