అభిమానులతో ఆర్‌జీవీ మందు పార్టీ.. వంగవీటి హీరోయిన్‌పై హాట్ కామెంట్స్

  • Published By: vamsi ,Published On : December 29, 2019 / 07:12 AM IST
అభిమానులతో ఆర్‌జీవీ మందు పార్టీ.. వంగవీటి హీరోయిన్‌పై హాట్ కామెంట్స్

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అనగానే నిస్సందేహంగా రాసుకోగల పేర్ రామ్ గోపాల్ వర్మ. సంచలనాలను మాట్లాడుతూ… వివాదాలను క్రియేట్ చేసుకుంటూ పోతున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. బ్యూటిఫుల్ అనే సినిమాతో మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. లేటెస్ట్‌గా వర్మ చేసిన ట్వీట్ అటువంటి విషయాన్నే మరోసారి స్పష్టం చేసింది.  వర్మ తన అభిమానులను మందు పార్టీ చేసుకుందాం రమ్మంటూ ట్విట్టర్ ద్వారా ఆహ్వానించారు.

అయితే నిజంగా మందు పార్టీకి వెళ్దాం అనుకుంటున్నారమో.. అక్కడే వర్మ ఇచ్చే ట్విస్ట్ ఉంది. వర్మ పిలిచింది ఇంటికి కాదు. ఫేస్ బుక్ లైవ్‌లో జరిగే మందు పార్టీకి. ఫేస్‌బుక్‌లో లైవ్లో చేసుకునే మందుపార్టీ  చూస్తూ అభిమానులుకూడా పాల్గొని వోడ్కా తాగాలంటూ.. రామ్ గోపాల్ వర్మ కోరారు. ఇటీవలే బ్యూటిఫుల్ అనే సినిమాకు వర్మ తెగ పబ్లిసిటీ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే రెండు రోజులు క్రితం బ్యూటిఫుల్ సినిమా టీం నిర్వహించిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు వర్మ. హీరోయిన్‌ నైనా గంగూలీతో కలిసి స్టెప్పులేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైలర్ అయ్యింది.

లేటెస్ట్‌గా ఈ సినిమా కోసమే వర్మ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. బ్యూటిఫుల్ సినిమా న్యూ ఇయర్ పార్టీలో మీరు కూడా ఆహ్వానితులే అంటూ వర్మ తన అభిమానులకు పిలుపునిచ్చారు.  ‘మా “బ్యూటిఫుల్ ” టీం ప్రీ న్యూ ఇయర్ పార్టీలో నాతో పాటు నైనా గంగూలీ, పార్థ సూరి, అగస్త్య మంజు   ఉంటారని వర్మ వెల్లడించారు. Facebook, instagram ద్వారా 29వ తేదీ అంటే ఇవాళ రాత్రి 8.45 నుంచి లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.

ఇదే సమయంలో వర్మ వంగవీటి సినిమాను ఉద్ధేశిస్తూ.. హీరోయిన్‌పై హాట్ కామెంట్స్ చేశారు వర్మ. సూపర్ సీరియస్ వంగవీటి  కుమారి లో ఈ “బ్యూటిఫుల్” అందాలని ఇలా ఎప్పుడు చూసావయ్యా  అగస్త్య మంజు? అంటూ బ్యూటిఫుల్ సినిమా దర్శకుడు అగస్త్య మంజూని ప్రశ్నించాడు వర్మ. నైనా గంగూలి వర్మ తీసిన వంగవీటి సినిమాలో కుమారి పాత్రలో చేసిన సంగతి తెలిసిందే.