VV Vinayak: తన డైరక్షన్‌లో తానే హీరోగా నటిస్తానంటున్న వినాయక్.. “శీనయ్య” సినిమా ఏమైంది!

టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించి, తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకుని తెలుగునాట మాస్ డైరక్టర్ గా చెరగని ముద్ర వేసుకున్న దర్శకుడు "వి.వి.వినాయక్". దాదాపు టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో పని చేసిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఛత్రపతి హిందీ రీమేక్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తరువాత డైరక్టర్ వినాయక్ తన సొంత డైరెక్షన్ లో తానే కథానాయకుడిగా ఒక సినిమాని తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది.

VV Vinayak: తన డైరక్షన్‌లో తానే హీరోగా నటిస్తానంటున్న వినాయక్.. “శీనయ్య” సినిమా ఏమైంది!

VV Vinayak Plays a Hero Role Under his Direction

VV Vinayak: టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించి, తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకుని తెలుగునాట మాస్ డైరక్టర్ గా చెరగని ముద్ర వేసుకున్న దర్శకుడు “వి.వి.వినాయక్”. దాదాపు టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో పని చేసిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఛత్రపతి హిందీ రీమేక్ చేస్తున్నాడు.

VV Vinayak : కొడాలినాని వల్ల ఎన్టీఆర్‌తో ఆ సినిమా చేయలేకపోయా

అయితే ఈ సినిమా తరువాత డైరక్టర్ వినాయక్ తన సొంత డైరెక్షన్ లో తానే కథానాయకుడిగా ఒక సినిమాని తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు తన ఆస్థాన రచయత ఆకుల శివ కథ, మాటలు అందించ‌బోతున్నాడ‌ట‌. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన లక్ష్మీ, కృష్ణ, నాయక్ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ ఇద్దరు కలిసి ఒక డిఫరెంట్ ప్రాజెక్టును తెరపైకి తీసుకువస్తునట్టు, వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కాబోతున్నట్లు, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తీ వివరాలను ప్రకటించనున్నట్లు సమాచారం. కాగా గతంలో వినాయక్ హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్ లో “శీనయ్య” అనే సినిమా సగం షూటింగ్ జరుపుకున్నా, అవుట్ పుట్ సరిగా రావడం లేదని ఆ సినిమాని కాన్సుల్ చేసేశారు.