Waltair Veerayya : ఏపీలో RRR రికార్డును బద్దలు కొట్టిన వీరయ్య..

మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ మూవీలో ఒక పక్క మాస్ జాతర నిర్వహిస్తూనే మరో పక్క ప్రేక్షకుల చేత నవ్వులు పువ్వులు పూయించాడు చిరంజీవి. దీంతో థియేటర్ల వద్ద కాసుల వర్షం కురుస్తుంది. తాజాగా ఈ సినిమా మరో రికార్డుని సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టు అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డుని...

Waltair Veerayya : ఏపీలో RRR రికార్డును బద్దలు కొట్టిన వీరయ్య..

Waltair Veerayya

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాలో చిరంజీవి వింటేజ్ లుక్ లో మాస్ మూలవిరాట్ గా కనిపించి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాడు. రీ ఎంట్రీ తరువాత చిరంజీవి నుంచి వచ్చిన సినిమాలు అన్ని సీరియస్ కథలు అవడంతో.. చిరు కామెడీ టైమింగ్ ని చాలా మిస్ అయ్యారు ఆడియన్స్. ఈ మూవీలో ఒక పక్క మాస్ జాతర నిర్వహిస్తూనే మరో పక్క ప్రేక్షకుల చేత నవ్వులు పువ్వులు పూయించాడు చిరంజీవి. దీంతో థియేటర్ల వద్ద కాసుల వర్షం కురుస్తుంది.

Waltair Veerayya : పండక్కి వంద కోట్లు కలెక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య.. బ్యాక్ టు బ్యాక్ చిరంజీవి, రవితేజకి 100 కోట్ల సినిమాలు..

మొదటి రోజే రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన ఈ సినిమా.. కేవలం మూడు రోజుల్లోనే దాదాపు రూ.108 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి చిరంజీవి స్టామినా ఏంటో మరోసారి తెలియజేసింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డుని సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టు అయిన ‘ఆర్ఆర్ఆర్’ రికార్డుని వాల్తేరు వీరయ్య సినిమా ఆంధ్రప్రదేశ్ లో బద్దలు కొట్టేసింది. ఏపీ లోని తాడిపత్రిలో విడుదలైన మూడు రోజులకు గాను RRR.. రూ.9.4 లక్షలు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ కలెక్షన్స్ ని వాల్తేరు వీరయ్య అలవోకగా దాటేసింది.

మూడు రోజులకు గాను వాల్తేరు వీరయ్య సినిమాకు రూ.11.23 లక్షలు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ కలెక్షన్స్ తో చిరంజీవి.. ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానం ఇంకా తనదే అని నిరూపించుకున్నాడు. కాగా ఈ సినిమాలో టాలీవుడ్ లోని మరో హీరో రవితేజ కూడా నటించాడు. చిరంజీవికి తమ్ముడిగా రవితేజ కనిపించాడు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎమోషనల్ గా కట్టి పడేస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలైట్ అంటున్నారు. కాగా తన గత చిత్రాలకు గాను దేవిశ్రీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదురుకున్న విషయం తెలిసిందే.