Waltair Veerayya : అమెరికాలో మెగాస్టార్ మరో రికార్డు.. కొనసాగుతున్న వాల్తేరు వీరయ్య ప్రభంజనం..
వాల్తేరు వీరయ్య సినిమా రిలీజయిన మూడు రోజులకే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ చేసి భారీ విజయం సాధించింది. ఇక ఇప్పటికే దాదాపు 150 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు సమాచారం. అయితే మెగాస్టార్ మానియా ఇక్కడే కాదు అమెరికాలో కూడా..........

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా, రవితేజ, క్యాథరిన్, బాబీ సింహ ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన సినిమా వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజయి భారీ విజయం సాధించింది. పండగ నాడు పక్కా కమర్షియల్, మాస్, ఎమోషన్ ఎలిమెంట్స్ తో వచ్చి అభిమానులనే కాక ప్రేక్షకులని కూడా అలరిస్తుంది ఈ సినిమా.
వాల్తేరు వీరయ్య సినిమా రిలీజయిన మూడు రోజులకే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ చేసి భారీ విజయం సాధించింది. ఇక ఇప్పటికే దాదాపు 150 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు సమాచారం. అయితే మెగాస్టార్ మానియా ఇక్కడే కాదు అమెరికాలో కూడా బాగా వినిపిస్తుంది. చిరంజీవి, రవితేజ కలిసి ఈ సినిమా చేయడంతో సినిమా ఇంకా పాపులర్ అయింది. అమెరికాలో కూడా బాస్, మాస్ అభిమానులు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ సాధించాలని అన్ని సినిమాలు అనుకుంటాయి.
తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా వారం రోజుల్లోపే అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ గ్రాస్ కలెక్షన్స్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అంటే దాదాపు 16 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. చిరంజీవికి అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ సాధించిన మూడో సినిమా ఇది. ఇప్పటికే చిరంజీవి సైరా నరసింహారెడ్డి, ఖైదీ సినిమాలతో ఈ ఫీట్ ని సాధించారు. ఈ కలెక్షన్స్ ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఇలా అమెరికాలో కూడా మరో రికార్డు సాధించడంతో చిరు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Pure domination of Veerayya at USA Box Office ?
MEGA MASS BLOCKBUSTER #WaltairVeerayya enters the elite $ 2M club ❤️??
MEGASTAR @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP #ArthurAWilson @SonyMusicSouth pic.twitter.com/1KUZpM6flv
— Mythri Movie Makers (@MythriOfficial) January 19, 2023