Waltair Veerayya: మిలియన్ డాలర్ క్లబ్‌లో ‘వాల్తేరు వీరయ్య’ వీరంగం!

మెగాస్టార్ చిరంజీవి పూనకాలు తెప్పిస్తూ సంక్రాంతి బరిలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించింది చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటించగా, అందాల భామ శ్రుతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

Waltair Veerayya: మిలియన్ డాలర్ క్లబ్‌లో ‘వాల్తేరు వీరయ్య’ వీరంగం!

Waltair Veerayya Enters Million Dollar Club In USA

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి పూనకాలు తెప్పిస్తూ సంక్రాంతి బరిలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించింది చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటించగా, అందాల భామ శ్రుతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

Waltair Veerayya : కర్ణాటకలో 154 ఆటోలతో మెగా ఫ్యాన్స్ జాతర..

ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండగా, బాక్సాఫీస్ వద్ద బాస్ తన స్వాగ్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాకు ఓవర్సీస్‌లోనూ అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతుండటంతో ఈ సినిమా అప్పుడే మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. చిరంజీవి కెరీర్‍‌లో ఈ ఫీట్ సాధించి మరో సూపర్ హిట్ సినిమాగా వాల్తేరు వీరయ్య నిలిచింది. గతంలో ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ సినిమాలు ఈ ఫీట్‌ను అందుకున్నాయి.

Waltair Veerayya : వాల్తేరు వీరయ్య ఈ ఓటీటీలోనే వచ్చేది..

ఇప్పుడు వాల్తేరు వీరయ్య కూడా మిలియన్ డాలర్ క్లబ్‌లోకి అడుగుపెట్టడంతో రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధించడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.