Waltair Veerayya : వాల్తేరు వీరయ్య ఈ ఓటీటీలోనే వచ్చేది..

ఇక ఇటీవల సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా ఏ ఓటీటీలో వస్తుందో ముందే చెప్పేస్తున్నారు. కొన్ని సినిమాల వాళ్ళు థియేటర్లో సినిమా రిలీజ్ ముందే ఓటీటీ, శాటిలైట్ స్ట్రీమింగ్ పార్టనర్స్ తెరపై వేస్తున్నారు. తాజాగా రిలీజయిన చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ఓటీటీ, శాటిలైట్ స్ట్రీమింగ్ పార్టనర్స్...............

Waltair Veerayya : వాల్తేరు వీరయ్య ఈ ఓటీటీలోనే వచ్చేది..

Waltair Veerayya locks their OTT Partner

Waltair Veerayya :  చిరంజీవి, శృతి హాసన్ జంటగా రవితేజ, క్యాథరిన్ ట్రెసా ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా నేడు జనవరి 13న థియేటర్స్ లో రిలీజ్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో, డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి ఆట నుంచి ప్రేక్షకులని అలరిస్తుంది. చిరంజీవి, రవితేజ ఇద్దరూ కలిసి స్క్రీన్ పై మాస్, కామెడీ, యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులని మెప్పించారు.

ఇక ఇటీవల సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా ఏ ఓటీటీలో వస్తుందో ముందే చెప్పేస్తున్నారు. కొన్ని సినిమాల వాళ్ళు థియేటర్లో సినిమా రిలీజ్ ముందే ఓటీటీ, శాటిలైట్ స్ట్రీమింగ్ పార్టనర్స్ తెరపై వేస్తున్నారు. తాజాగా రిలీజయిన చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ఓటీటీ, శాటిలైట్ స్ట్రీమింగ్ పార్టనర్స్ ఎవరో కూడా ఇప్పుడే తెరపై చెప్పేశారు.

Waltair Veerayya Review : తమ్ముడు కోసం అన్నయ్య చేసే పోరాటమే వాల్తేరు వీరయ్య.. వింటేజ్ కామెడీ యాక్షన్ బాస్ ఈజ్ బ్యాక్..

వాల్తేరు వీరయ్య సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రానుంది. ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులు జెమిని టీవీ దక్కించుకున్నట్టు తెలిపారు. అయితే సినిమా రిలీజయిన నెల రోజుల తర్వాతే ఓటీటీలో వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని సినిమాలు 50 రోజుల తర్వాత రిలీజయ్యేలా ఒప్పందం చేసుకుంటున్నారు. అయితే వాల్తేరు వీరయ్య ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుందో చెప్పినా ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాత్రం ప్రకటించలేదు. ఇక టీవీలో అయితే ఇప్పట్లో రాదనీ అందరికి తెలిసిందే. ఇలాంటి పెద్ద సినిమాలు ఏదైనా పెద్ద పండగ చూసుకొని ఓటీటీలో రిలీజ్ అయినా తర్వాత టీవిలో వేస్తారు.