Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ శాటిలైట్ రైట్స్‌కు సాలిడ్ రేటు.. ఎవరు సొంతం చేసుకున్నారంటే..?

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తుండగా, జనవరి 13న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ శాటిలైట్ రైట్స్‌కు సాలిడ్ రేటు.. ఎవరు సొంతం చేసుకున్నారంటే..?

Waltair Veerayya Satellite Rights Sold For Bomb

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తుండగా, జనవరి 13న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు బాబీ ఊరమాస్ కంటెంట్ తో తీసుకొస్తుండగా, చిరంజీవి చాలా రోజుల తరువాత ఇలాంటి మాస్ పాత్రలో కనిపిస్తుండటంతో, ఈ సినిమాతో ఆయన ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారా అని ప్రేక్షకులు సైతం ఆతృతగా చూస్తున్నారు.

Waltair Veerayya : ‘నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ’ అంటూ మరో పాట లీక్ చేసిన చిరు..

ఈ సినిమా ట్రైలర్‌ను మరికొద్ది గంటల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ క్రమంలో వాల్తేరు వీరయ్య చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ టీవీ ఛానల్ జెమెని భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి గత మూడు చిత్రాల శాటిలైట్ రైట్స్‌ను కూడా ఈ ఛానల్ సొంతం చేసుకోవడంతో, ఇప్పుడు వాల్తేరు వీరయ్య శాటిలైట్ రైట్స్ కోసం భారీ రేటును ఆఫర్ చేసిందట. దీంతో చిరు నెక్ట్స్ మూవీని కూడా జెమిని టీవీలోనే బుల్లితెర ప్రేక్షకులు చూడనున్నారు.

Waltair Veerayya: ఫ్యాన్స్‌కు వీరయ్య గిఫ్ట్.. ఆ ఐకానిక్ డ్యాన్స్ స్టెప్‌తో థియేటర్లు దద్దరిల్లిపోనున్నాయి!

కాగా, వాల్తేరు వీరయ్య మూవీలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ రాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి వాల్తేరు వీరయ్య మూవీకి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో తెలియాలంటే జనవరి 13 వరకు వెయిట్ చేయాల్సిందే.