Waltair Veerayya: టైటిల్ సాంగ్‌తో దిగుతున్న వీరయ్య.. పూనకాలతో ఫ్యాన్స్ రెచ్చిపోడం ఖాయం!

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ ఇటీవల వరుస అప్డేట్స్‌తో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయినా కూడా తమ బాస్ సినిమా నుంచి ఇలా అప్డేట్ వచ్చిందో లేదో, అలా సోషల్ మీడియాను రఫ్ఫాడించేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. బాస్ పార్టీ, చిరంజీవి శ్రీదేవి అనే రెండు సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.

Waltair Veerayya: టైటిల్ సాంగ్‌తో దిగుతున్న వీరయ్య.. పూనకాలతో ఫ్యాన్స్ రెచ్చిపోడం ఖాయం!

Waltair Veerayya Title Song To Be Released On Dec 26

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ ఇటీవల వరుస అప్డేట్స్‌తో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయినా కూడా తమ బాస్ సినిమా నుంచి ఇలా అప్డేట్ వచ్చిందో లేదో, అలా సోషల్ మీడియాను రఫ్ఫాడించేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. బాస్ పార్టీ, చిరంజీవి శ్రీదేవి అనే రెండు సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’లో మాస్ రాజా ఎంతసేపు కనిపిస్తాడో తెలుసా..?

తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలోని మూడో సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. వీరయ్య టైటిల్ సాంగ్‌గా రాబోతున్న ఈ పాటను డిసెంబర్ 26న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇక వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ కూడా నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Waltair Veerayya: శ్రీదేవితో చిరంజీవి రాకకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు వస్తున్నారంటే?

రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్‌ను అందిస్తుండగా, అందాల భామ శ్రుతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ రాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.