Waltair Veerayya: వీరయ్య సింగిల్‌గానే వచ్చి వాయిస్తాడా..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీతో చాలా కాలం తరువాత చిరంజీవి ఊరమాస్ అవతారం ఎత్తడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Waltair Veerayya: వీరయ్య సింగిల్‌గానే వచ్చి వాయిస్తాడా..?

Waltair Veerayya To Come Single At Box Office

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీతో చాలా కాలం తరువాత చిరంజీవి ఊరమాస్ అవతారం ఎత్తడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Waltair Veerayya: మాస్ ఇంట్రోను రెడీ చేస్తున్న వాల్తేరు వీరయ్య..?

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్, బాస్ పార్టీ సాంగ్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, ఈ సినిమాలో చిరు పాత్రను ఊరమాస్‌గా తీర్చిదిద్దాడట దర్శకుడు. అయితే ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేయడంతో అభిమానులు సంక్రాంతి పండగ కోసం ఆతృతగా చూస్తున్నారు. కానీ.. ఇప్పటికే సంక్రాంతి బరిలో వస్తున్న మరికొన్ని సినిమాలు తమ రిలీజ్ డేట్స్‌ను ఫిక్స్ చేసుకోవడంతో వీరయ్య ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది.

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’లో ఆ సీన్స్ పీక్స్‌లో ఉంటాయట..!

తమిళ హీరో విజయ్ నటిస్తున్న ‘వారిసు’ సినిమా, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ సినిమా రెండు కూడా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే వాల్తేరు వీరయ్య మాత్రం తన రిలీజ్ డేట్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు. దీంతో అభిమానులు ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో అయోమయంలో పడిపోయారు. కాగా, ఈ సినిమాను సింగిల్‌గా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. జనవరి 12న కాకుండా, 13వ తేదీన రిలీజ్ చేయాలా.. లేక సంక్రాంతి బరిలో కాకుండా వారం తరువాత రిలీజ్ చేయాలా అనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పటికైతే ‘వాల్తేరు వీరయ్య’ సింగిల్‌గానే వస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడనేది చిత్ర యూనిట్ ఫిక్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.