Wamiqa Gabbi: బాహుబలి బిఫోర్ బిగెనింగ్.. శివగామిగా వామిక!

‘భలే మంచి రోజు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ వామిక గబ్బి. తెలుగు, తమిళ, మలయాళ, పంజాబీ సినిమాల్లో నటించి క్రేజ్ క్రియేట్ చేసుకున్న ఈ భామ అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్‌లతో హీట్ పుట్టిస్తోంది.

Wamiqa Gabbi: బాహుబలి బిఫోర్ బిగెనింగ్.. శివగామిగా వామిక!

Shivagami

Wamiqa Gabbi: ‘భలే మంచి రోజు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ వామిక గబ్బి. తెలుగు, తమిళ, మలయాళ, పంజాబీ సినిమాల్లో నటించి క్రేజ్ క్రియేట్ చేసుకున్న ఈ భామ అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్‌లతో హీట్ పుట్టిస్తోంది. ఇప్పుడు ఓ సూపర్ హిట్ సినిమా ప్రీక్వెల్‌లో పవర్‌ఫుల్ పాత్రలో నటించేందుకు సిద్ధం అవుతోంది వామిక. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ నటించిన శివగామి పాత్రలో నటించేందుకు సిద్ధం అవుతోంది వామిక.

 

View this post on Instagram

 

A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi)


బాహుబలి సినిమాలు తెలుగు సినిమా స్థాయిని ఏ స్థాయికి పెంచాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాల కారణంగానే టాలీవుడ్ మార్కెట్ బాలీవుడ్‌లో అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమాల స్పూర్తితోనే తెలుగులో దాదాపు అందరు పెద్ద హీరోలు ప్యాన్ ఇండియా మూవీలు చెయ్యడం స్టార్ట్ చేశారు. బహుబలి సినిమాలు అందించిన విజయాలతో నెట్ ఫ్లిక్స్ ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేసింది. ఈ వెబ్ సిరీస్‌ కోసమే ఇప్పుడు వామికను సెలెక్ట్ చేసుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi)

బాహుబలి సినిమాలో చర్చించనీ విషయాలను ప్రధానంశంగా తీసుకుని బాహుబలి బిఫోర్ బిగినింగ్ అంటూ సినిమాను తీయబోతున్నారు. ఈ సీరీస్ కోసం దర్శక నిర్మాతలు కసరత్తులు చేస్తుండగా… నటుల విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావట్లేదు. బాహుబలి సినిమాలో పవర్‌ఫుల్ పాత్ర అయిన శివగామి కథే ఇందులో కథాంశం. రాజమౌళి, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు దేవకట్టా, ప్రవీణ్ సత్తార్‌లు దర్శకత్వం వహించబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమ్ అవ్వనుంది.

 

View this post on Instagram

 

A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi)