SitaRamam: యుద్ధంతో రాసిన ప్రేమ కథ ‘సీతా రామం’.. గ్లిమ్ప్స్ రిలీజ్!

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో వ‌రుస సినిమాలు చేస్తూ అంద‌ర్నీ మెప్పిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో తెలుగు..

SitaRamam: యుద్ధంతో రాసిన ప్రేమ కథ ‘సీతా రామం’.. గ్లిమ్ప్స్ రిలీజ్!

Sitaramam

SitaRamam: మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో వ‌రుస సినిమాలు చేస్తూ అంద‌ర్నీ మెప్పిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. అయితే ఈ స్టార్ ఇప్పుడు త్రిభాషా చిత్రంలో ఓ సినిమాను చెయ్యబోతున్నాడు. హ‌ను రాఘ‌వ‌పూడి దర్శకత్వంలో లెఫ్టినెంట్ రామ్ అనే సైనికుడి ప్రేమ‌క‌థ‌లో హీరోగా కనిపించనున్నాడు దుల్క‌ర్ స‌ల్మాన్‌. తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమా రూపొంద‌నుంది.

Dulquer Salmaan : త్వ‌ర‌లో త‌న ప్రేమ కావ్యంతో మ‌న ముందుకు రాబోతున్న లెఫ్ట్‌నెంట్ రామ్..

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్నా సినిమాస్ బ్యాన‌ర్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దుల్క‌ర్ స‌ల్మాన్‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆ మధ్య ఈ సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేయగా మంచి అంచనాలు క్రియేట్ చేసింది. కాగా.. ఈ సినిమాకి ‘సీతా రామం’ అనే క్యాచీ టైటిల్‌ ను.. నేడు (ఏప్రిల్ 10) శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రకటించారు. ఆకట్టుకొనే పోస్టర్ ను ఈ సందర్భంగా షేర్ చేశారు. అలాగే అదిరిపోయే ఓ గ్లింప్స్ వీడియోను కూడా విడదుల చేశారు.

Salute Movie : దుల్కర్ డిఫరెంట్ థ్రిల్లర్ ‘సెల్యూట్’..

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఓ సైనికుడు శత్రువుకి అప్పగించిన యుద్ధం అఫ్రీనా.. ఈ యుద్ధంలో సీతారాములని నువ్వే గెలిపించాలి అని వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ గ్లిమ్ప్స్ లో.. సీతారాములా ఎవరు వాళ్ళు అంటూ రష్మిక పాత్ర అఫ్రీనా పలికే మాటలు సినిమా మీద అంచనాలను పెంచేస్తుంది. అలాగే ఈ వీడియోలోనే దుల్కర్, మృణాల్ ఠాకూర్ లుక్స్ కూడా రిలీజ్ చేశారు. ఇది 1964 నేప‌థ్యంలో తెర‌కెక్కే పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరి కాగా సీతా రామం అనే టైటిల్ తో పాటు యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థ‌’ అనే క్యాప్ష‌న్ సినిమాపై ఆస‌క్తిని రేపుతుంది.