ఎట్టకేలకు మహేష్ అభిమానుల కోరిక తీర్చిన వార్నర్… 

  • Published By: vamsi ,Published On : May 30, 2020 / 07:21 AM IST
ఎట్టకేలకు మహేష్ అభిమానుల కోరిక తీర్చిన వార్నర్… 

కొద్ది రోజులుగా తెలుగు సినిమా డైలాగులు చెబుతూ, తెలుగు సినిమా పాటలకు స్టెప్పులేస్తూ ఆకట్టుకుంటున్న ఆస్ట్రేలియన్ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యుడు డేవిడ్ వార్నర్.. మహేష్ బాబు అభిమానుల కోరికను కూడా తీర్చాడు.

కరోనా ప్రభావంతో ఇంట్లోనే ఉంటూ ఎంజాయ్ చేస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్.. మైదానంలో బౌలర్లపై చిచ్చర పిడుగులా రెచ్చిపోయే  డేవిడ్ వార్నర్.. ట్విట్టర్‌లో మరో వీడియో పోస్ట్ చేసి అలరించాడు. మహేశ్ బాబు నటించిన ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ సినిమాలో మైండ్ బ్లాక్ పాటకు తన భార్యతో కలిసి స్టెప్పులేసి అలరించాడు. 

ఇప్పటికే పలువురు తెలుగు హీరోల పాటలకు స్టెప్పులు వేసిన వార్నర్.. మహేష్ బాబు అభిమానుల కోర్కెను ఇలా తీర్చేశాడు. మహేష్ బాబు అభిమానులు చాలా రోజుల నుంచి మైండ్ బ్లాక్ పాటకు స్టెప్పులేయమని అడుగుతుండగా.. ఆ పాట అందుబాటులో లేదని సమాధానం చెబుతూ ఉన్నాడు.. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా పాటకు భార్యతో కలిసి స్టెప్పులేశాడు. 

ఆ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వార్నర్.. `51వ ప్రయత్నం.. మహేష్ `మైండ్‌బ్లాక్` పాటలోని మొదటి భాగం` అంటూ కామెంట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Read:  ఏలియన్స్ దాడులా?:ప్రపంచం లాక్‌డౌన్‌లో ఉంటే మిడతలు ప్రపంచ యాత్రలో ఉన్నాయ్