ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ నుండి 'విజయం' వీడియో సాంగ్

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ నుండి ‘విజయం’ వీడియో సాంగ్

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ నుండి ‘విజయం’ వీడియో సాంగ్

రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌.  ఎన్టీఆర్ జీవితంలో కొత్త కోణాన్ని.. ప్రజలకు తెలియని రహస్యాలను లక్ష్మీ పార్వతి కోణంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు వర్మ. అయితే మార్చి 29న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారంటూ వ‌ర్మ ఇటీవ‌ల త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించి ప‌లు వీడియో సాంగ్స్ విడుద‌ల చేస్తున్న వ‌ర్మ తాజాగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా ‘విజయం.. ఘన విజయం’ అంటూ సాగిన వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. ఎస్పీ బాల సుబ్ర‌హ్మాణ్యం, మోహ‌న్ భోగ‌రాజు క‌లిసి ఈ పాట‌ని ఆల‌పించారు. కళ్యాణి మాలిక్ స్వరాలను సమకూర్చారు. క‌ళ్యాణ్ మాలిక్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మెలోడీ సాంగ్‌ని సిరాశ్రీ రాసారు. 

యజ్ఞాశెట్టి, విజయ్ కుమార్‌లపై చిత్రీకరించిన ఈ సాంగ్‌లో ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతికి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారు.. ఎన్టీఆర్ విజయంలో లక్ష్మీ పార్వతి ఎలాంటి పాత్రను పోషించింది.. ఆమెపై చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎలాంటి కుట్రలు చేశారు లాంటి కీలక సన్నివేశాలను క్లియర్ గా చూపించారు.

×