Acharya Film : మళ్లీ మేకప్ వేసుకోనున్న చిరంజీవి

  • Published By: madhu ,Published On : November 4, 2020 / 04:50 PM IST
Acharya Film : మళ్లీ మేకప్ వేసుకోనున్న చిరంజీవి

Konidela Pro Company : మెగాస్టార్ చిరంజీవి మళ్లీ మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. న్యూ ఫిల్మ్ ‘ఆచార్య’ ఫిల్మ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే..కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు నిలిచిపోయాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ..ప్రస్తుతం సినిమా షూటింగ్ లు జరుగుతున్నాయి. ఆచార్య సినిమా షూటింగ్ కు సంబంధించి కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ ట్వీట్ చేసింది.



న‌వంబ‌ర్ 9 నుంచి షూటింగ్ షురూ కానున్న‌ట్టు వెల్లడించింది. కరోనా కారణంగా అన్న నిబంధనలు పాటిస్తూ..సుమారు నెల రోజుల పాటు లాంగ్ షూటింగ్ జరుపనున్నట్లు తెలపడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అంతేగాదు..సినిమా ఎప్పుడు విడుదల చేస్తామో కూడా వెల్లడించింది. 2021లో వేస‌వి కానుక‌గా సినిమాను విడుదల చేస్తామ‌ని ప్ర‌క‌టించింది.



మెగాస్టార్ కి ఇది 152వ సినిమా. చిరంజీవి శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పిస్తుండగా..రామ్ చరణ్ ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం నవంబర్ 09వ తేదీ నుంచి జరిగే..షూటింగ్ లో మేజర్ పార్ట్ పూర్తవుతుందని తెలుస్తోంది.



ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ అందర్నీ అలరించింది. చిరంజీవి పక్కన కాజల్ నటిస్తోంది. ఇటీవలే ఈమె వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం జరిగే షూటింగ్ లో ఈమె పాల్గొంటారా ? లేదా ? అనేది తెలియడం లేదు. ఆచార్య సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.