SonuSood: కేటీఆర్‌ వంటి నాయకుడు ఉంటే మా అవసరం ఉండదు -సోనూసూద్

కేటీఆర్ లాంటి నాయకుడు ఉంటే నాలాంటి వాళ్ళు ఎక్కువ పనిచేయాల్సిన అవసరం ఉండదని అన్నారు సినీ నటుడు సోనూ సూద్.

SonuSood: కేటీఆర్‌ వంటి నాయకుడు ఉంటే మా అవసరం ఉండదు -సోనూసూద్

Sonu Sood

SonuSood: కేటీఆర్ లాంటి నాయకుడు ఉంటే నాలాంటి వాళ్ళు ఎక్కువ పనిచేయాల్సిన అవసరం ఉండదని అన్నారు సినీ నటుడు సోనూ సూద్. కరోనా వేళ చాలామంది పేదవారు ఇబ్బందులు పడ్డారని, కరోనా సమయంలో దేశవ్యాప్తంగా ఏడున్నర లక్షల మందికి సహాయం అందించినట్లు చెప్పారు సోనూసూద్. ఆక్సిజన్, మందులు, బెడ్స్ కావాలంటూ అర్థరాత్రులు కూడా కాల్స్ వచ్చేవని అన్నారు సోనూసూద్.

“నేనూ.. నా వాలంటీర్స్ ప్రతీరోజూ ఫోన్ కాల్స్ ఎత్తుతూనే ఉండాల్సి వచ్చేదని అన్నారు సోనూసూద్. నా సేవ వెనుక వేరే కారణాలు ఉన్నాయని చాలామంది విమర్శించేవారు. నన్ను డిమోరల్ చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారని చెప్పుకొచ్చారు. ప్రజలకు మంచి జరగకుండా పాపులు చాల ప్రయత్నాలు చేస్తార” అని అభిప్రాయపడ్డారు సోనూసూద్.

అవన్నీ దాటుకొని సేవ చేయాలని, నాపై వచ్చే విమర్శలను దాటుకొని ప్రజలకు సేవ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు సోనూసూద్. కోవిడ్ వారియర్లే తనకు హీరోలు అని చెప్పుకొచ్చారు సోనూసూద్. కొవిడ్‌తో ఉద్యోగాలు, చదువులు, ఆత్మీయులను కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారని అన్నారు. వాళ్లకు సహాయ పడడమే ఇక తన ముందున్న సవాల్‌ అన్నారు సోనూసూద్.