Geeta Arts : వరద బాధితులకు గీతా ఆర్ట్స్ అండ..రూ. 10 లక్షల విరాళం

భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన ఏపీని తక్షణం ఆదుకునేందుకు.. వెయ్యి కోట్లు విడుదల చేయాలని.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు విడివిడిగా లేఖలు రాశారు సీఎం జగన్.

Geeta Arts : వరద బాధితులకు గీతా ఆర్ట్స్ అండ..రూ. 10 లక్షల విరాళం

Geeta

Geeta Arts AP Rain: ఏపీలో వరద బాధితులకు అండగా తామున్నామంటూ గీతా ఆర్ట్స్‌ ముందుకొచ్చింది. బాధితులకు అదుకునేందుకు విరాళం ఇచ్చింది. పది లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం తమ వంతు సాయం చేస్తున్నట్టు గీతా ఆర్స్ట్ ప్రకటించింది. విరాళం ఇస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

Read More : IIT Experts : కొండ చరియలు విరిగిపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

మరోవైపు…

భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన ఏపీని తక్షణం ఆదుకునేందుకు.. వెయ్యి కోట్లు విడుదల చేయాలని.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు విడివిడిగా లేఖలు రాశారు సీఎం జగన్. ప్రాథమిక అంచనా ప్రకారం… దాదాపు 6 వేల 54 కోట్ల నష్టం వాటిల్లినట్లు.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. భారీ వర్షాలకు లక్షా 43 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్నారు. ఫలితంగా.. 1402 కోట్ల మేర రైతులకు నష్టం వాటిల్లిందని చెప్పారు. రోడ్లు దెబ్బతినడంతో 1756 కోట్ల నష్టం సంభవించినట్లు లేఖలో తెలిపారు. వీలైనంత త్వరగా.. కేంద్ర బృందాన్ని.. రాష్ట్రానికి పంపించి.. వరద నష్టాన్ని అంచనా వేయాలని కోరారు.

Read More : Vehicle Tax : పన్నుల మోత.. ఏపీలో వాహ‌నదారులకు బ్యాడ్ న్యూస్

ఇక.. ఈ నెల 26 నుంచి మళ్లీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలతో.. ప్రభుత్వం అలర్టైంది. 27, 28, 29 తేదీల్లో  నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. భారీ వర్ష సూచనలపై.. కలెక్టర్లు నివేదికలు పంపించాలని.. తద్వారా ఆయా ప్రాంతాల్లో చర్యలు తీసుకునే వీలుంటుందని.. సీఎం జగన్ సూచించారు.