Web Series – Family Man: ఫ్యామిలీ మ్యాన్.. మీర్జాపూర్ లాంటి వెబ్ సిరీస్‌లు పోర్న్‌లే – సునీల్ పాల్

శిల్పాశెట్టి భర్త.. వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత పోర్నోగ్రఫీపై చర్చ టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. దీనిపై 2005 గ్రేట్ ఇండియన్ లాఫర్ ఛాలెంజ్ గెలిచిన కమెడియన్ సునీల్ పాల్ ఇలా స్పందించారు.

Web Series – Family Man: ఫ్యామిలీ మ్యాన్.. మీర్జాపూర్ లాంటి వెబ్ సిరీస్‌లు పోర్న్‌లే – సునీల్ పాల్

Web Series

Web Series – Family Man: శిల్పాశెట్టి భర్త.. వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత పోర్నోగ్రఫీపై చర్చ టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. దీనిపై 2005 గ్రేట్ ఇండియన్ లాఫర్ ఛాలెంజ్ గెలిచిన కమెడియన్ సునీల్ పాల్ ఇలా స్పందించారు. ద ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్ లకు కూడా డిజిటల్ ప్లాట్ ఫాంలపై సెన్సార్ షిప్ ఉండాలని ఆరోపణలు వినిపించాయి.

ఏం జరిగిందో జరిగిపోయింది. తప్పదు కాబట్టే జరిగింది. పెద్ద వాళ్లు వెబ్ సిరీస్ లేదా మరే ప్లాట్ ఫాం అయినా సెన్సార్ షిప్ లేదు కాబట్టి దానిని వాడుకున్నారు. ప్రస్తుతం వస్తున్న వెబ్ సిరీస్ లో ఇంట్లో కూర్చొని చూడలేం. ప్రత్యేకించి చెబుతున్నా మనోజ్ బాజ్ పేయి లాంటి ముగ్గురు, నలుగురిని నేనిష్టపడను. అతనెంత పెద్ద యాక్టర్ అయినప్పటికీ అంతే.

నీకు దేశం ప్రెసిడెంట్ అవార్డ్ ఇచ్చింది. ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం నువ్వేం చేస్తున్నావ్. భార్య ఇంకొకరితో ఎఫైర్ లో ఉన్నట్లు వెబ్ సిరీస్ తీస్తున్నావ్. మైనర్ కూతురు బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుండటం. చిన్న పిల్లాడు పెద్దవాళ్లలా ప్రవర్తించడం. ఇది చూడటానికి ఫ్యామిలీలా ఉందా.. ఇప్పుడది ఆపేసినా చూపించడానికి ఇంకేం మిగిలి ఉంది. అంటూ సునీల్ పాల్ ప్రశ్నించారు.

ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 సిరీస్ లాంచ్ సూపర్ సక్సెస్ కాగా, ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 జూన్ లో విడుదలై అంతే హిట్ అయింది. ఇక మీర్జాపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేనంతగా హిట్ అయింది.