ఆ శుభలేఖలో బాలయ్యే దేవుడు : కొత్త జంట వీరాభిమానం

  • Published By: vamsi ,Published On : May 6, 2019 / 04:47 AM IST
ఆ శుభలేఖలో బాలయ్యే దేవుడు : కొత్త జంట వీరాభిమానం

హీరోలకు అభిమానులు ఉంటారు. వీరాభిమానులు ఉంటారు. సినిమా విడుదలైతే పాలాభిషేకాలు, జంతు బలులు. పుట్టిన రోజైతే రక్తదానాలు, కేక్ కటింగ్‌లు. అయితే ఇప్పుడు ఆ అభిమానం మరింత ముందుకు వెళ్తుంది. తమ కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటే పెళ్లి కార్డుల్లో సైతం వారికి అభిమాన హీరోలకు చోటిస్తున్నారు. సాధారణంగా పెళ్లి కార్డులో దేవుళ్ల ఫోటోలు ప్రచురిస్తారు. కానీ ఓ వీరాభిమని మాత్రం పెళ్లి కార్డుపై నందమూరి బాలకృష్ణ ఫోటో ఎక్కించేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకకు చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి తన కొడుకు పెళ్లిని మే 13న చేయబోతున్నాడు.

ఆ పెళ్లికి సంబంధించిన కార్డులో బాలయ్య ఫోటోలను పెట్టి ముద్రించిన శ్రీనివాసులు.. నందమూరి అభిమానులంతా తన కుమారుడి పెళ్లికి హాజరు కావాలని కోరుతూ ఆహ్వానం పలికాడు. మే 13న తన కుమారుడి పెళ్లికి బాలయ్య, నందమూరి అభిమానులు హాజరై.. తన కుమారుడికి ఆశీస్సులు అందించాలని కోరాడు. ఈ దంపతులకు బాలయ్య బాబు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు శ్రీనివాసులు వెల్లడించారు. కాగా ఈ పెళ్లి పత్రికకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వెడ్డింగ్ కార్డు చూసిన నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.