ముచ్చటగా మూడో పెళ్లి చేసుకోనున్న వనిత విజయ్ కుమార్

సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ దంపతుల పెద్ద కూతురు వనిత విజయ్ కుమార్ త్వరలో మూడో పెళ్లి చేసుకోనుంది..

  • Published By: sekhar ,Published On : June 18, 2020 / 09:47 AM IST
ముచ్చటగా మూడో పెళ్లి చేసుకోనున్న వనిత విజయ్ కుమార్

సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ దంపతుల పెద్ద కూతురు వనిత విజయ్ కుమార్ త్వరలో మూడో పెళ్లి చేసుకోనుంది..

సామాన్యులు రెండో పెళ్లి చేసుకుంటే చిత్రంగా చూస్తాం కానీ, సెలబ్రిటీలకు ప్రేమ, పెళ్లి, విడాకులు, మళ్లీ పెళ్లి వంటివన్నీ మామూలే.. ఇలా రెండేసి మూడేసి సార్లు మూడు ముళ్లు వేసిన వాళ్లని వేయించుకున్న వాళ్లని చూశాం.. తాజాగా ఓ నటి ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధమైంది అనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె ఎవరో కాదు.. సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ దంపతుల పెద్ద కూతురు వనిత విజయ్ కుమార్..

1999లో ‘దేవి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది వనిత. ఆమె మొదట 2000 వ సంవత్సరంలో తమిళ టీవీ నటుడు ఆకాష్‌ను పెళ్లాడింది. వీరికి ఓ బాబు, పాప ఉన్నారు. 2007లో ఆకాష్‌తో విడాకులు తీసుకున్న వనిత, ఆనంద్ జయ్ రాజన్ అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప సంతానం. కొంత కాలానికి అతనితో కూడా విడిపోయింది. విడాకులు, కిడ్నాప్ ఇలా నానా హంగామా చేసి కోర్టులు, కేసులు అంటూ వార్తల్లో నిలిచింది. కొన్నాళ్ల పాటు కొరియోగ్రాఫర్ రాబర్ట్‌తో సహజీవనం చేసింది.

Vanitha Vijay kumar

తాజాగా మూడో పెళ్లికి రెడీ అయింది వనిత. త్వరలో పీటర్ పాల్‌‌ను పెళ్లాడనుందామె. పీటర్ చెన్నైలో వీఎఫ్‌ఎక్స్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. జూన్ 27న గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం చెన్నైలోని తమ నివాసంలో వీరి పెళ్లి జరుగనుందని అధికారికంగా ప్రకటిస్తూ వెడ్డింగ్ కార్డ్ కూడా పోస్ట్ చేశారు. వనిత సిస్టర్స్ ప్రీతి, శ్రీదేవి, బ్రదర్ అరుణ్ విజయ్ కూడా నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తానికి మూడో పెళ్లితో మరోసారి వార్తల్లో నిలిచింది వనిత విజయ్ కుమార్.

Vanitha Vijay kumar