April Movies: వారానికో పెద్ద సినిమా.. ఏప్రిల్‌లో థియేటర్లకి పండుగే

ఇన్నాళ్లూ ఓ లెక్క.. ఇప్పుడో లెక్క. కొవిడ్ లాక్ డౌన్ తర్వాత సినిమాలు మొదలైన సరైన పెద్ద సినిమా లేక థియేటర్ల వైపు జనాల అడుగులు

April Movies: వారానికో పెద్ద సినిమా.. ఏప్రిల్‌లో థియేటర్లకి పండుగే

Movies in April

April Movies: ఇన్నాళ్లూ ఓ లెక్క.. ఇప్పుడో లెక్క. కొవిడ్ లాక్ డౌన్ తర్వాత సినిమాలు మొదలైన సరైన పెద్ద సినిమా లేక థియేటర్ల వైపు జనాల అడుగులు తడబడ్డాయి. కానీ, ఏప్రిల్ మాత్రం కథ వేరే ఉండేలా కనిపిస్తుంది. ఏప్రిల్ 3 నుంచి రిలీజ్ అవనున్న సినిమాలు టాలీవుడ్ అభిమానులను టెంప్టింగ్ లో పడేసేలా ఉన్నాయి.

ఏప్రిల్ మొదటి వారంలో నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ మూవీ థియేటర్లలోకి వస్తోంది. సినిమాపై నమ్మకంతో ఓటీటీ డీల్ ను రద్దు చేసుకున్నారు. అహితోష్ సోల్మాన్ దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ సినిమాపై నాగ్ పెట్టుకున్న ఆశలు అలాంటివి మరి. దాంతో పాటు సుల్తాన్, యువరత్న అనే 2 డబ్బింగ్ సినిమాలొస్తున్నాయి. వీటిలో కార్తి-రష్మిక కలిసి చేసిన సుల్తాన్ పై ఓ మోస్తరు అంచనాలున్నాయి.

ఏప్రిల్ రెండో వారంలో మోస్ట్ వాంటింగ్ మూవీ వకీల్ సాబ్ థియేటర్లలో కనువిందు చేయనుంది. పవర్ స్టార్ గ్యాప్ తో కళ్లలో ఒత్తులేసుకున్న చూస్తున్న అభిమానులకు ఇది పెద్ద పండుగే. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ప్రతి వారం 3 కంటే ఎక్కువ సినిమాలే రిలీజ్ అయ్యాయి. ఏప్రిల్ 9న పవన్ కల్యాణ్ సోలోగా వస్తుండటంతో భారీ అంచనాలేకనిపిస్తున్నాయి. అందుకే ఆ వారం ఇంకో సినిమా రేసులో లేదు.

ఓ వారం రోజులకు లవ్ స్టోరీ వస్తోంది. నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో లవ్ స్టోరీపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాతో పాటు 99 సాంగ్స్, కనబడుట లేదు అనే రెండు సినిమాలు ప్రస్తుతానికి షెడ్యూల్ అయి ఉన్నాయి.

దీనికి పోటీగా రావాల్సిన టక్ జగదీశ్ సినిమాను వారం రోజులు వాయిదావేసి ఏప్రిల్ 23న రిలీజ్ చేస్తున్నారు. ఇంతకుముందు హిట్ కొట్టిన నాని-శివనిర్వాణ కాంబినేషన్ పై కూడా భారీగా అంచనాలున్నాయి. ఇదే సినిమాతో పాటు తలైవి, శుక్ర అనే మరో చిన్న సినిమా థియేటర్లలోకి రాబోతున్నాయి.

ఏప్రిల్ నెల చివర్లో రానా-సాయిపల్లవి నటించిన విరాటపర్వం థియేటర్లలోకి వస్తోంది. ఆల్రెడీ పోస్ట్ పోన్ అయిన సీటీమార్ సినిమా కూడా అదే రోజున రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇలా ఏప్రిల్ నెలలో వారానికో పెద్ద సినిమా థియేటర్లలోకి వస్తోంది.