Mahesh Babu-Major: నాలుగేళ్లుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్‌బ్లస్టరే!

యంగ్‌ హీరో అడివి శేష్ నటించిన క్రేజీ పాన్ ఇండియా మూవీ 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mahesh Babu-Major: నాలుగేళ్లుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్‌బ్లస్టరే!

Mahesh Babu Major

Mahesh Babu-Major: యంగ్‌ హీరో అడివి శేష్ నటించిన క్రేజీ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ని అభిమానుల సమక్షంలో సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ఏఎంబీ సినిమాస్ లో ఏర్పాటు చేసిన ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు.

Major: ఉద్విగ్నంగా ‘మేజర్‌’ ట్రైలర్‌.. రిలీజ్ చేసిన మహేశ్ బాబు

మహేశ్‌ బాబు మాట్లాడుతూ.. మేజర్ టీమ్ ని చూస్తే గర్వంగా వుంది. మేజర్ ట్రైలర్ చూసినప్పుడు ప్రేక్షకుల రియాక్షన్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా చూశాను. కొన్ని సీన్లు చూస్తున్నపుడు గూస్ బంప్స్ వచ్చాయి. చివరి 30 నిమిషాలు నా గొంతు తడారిపోయింది. సినిమా పూర్తయిన తరవాత ఏం మాట్లాడలేకపోయాను. రెండు నిమషాల మౌనం తర్వాత శేష్ ని హాగ్ చేసుకున్నాను. బయోపిక్ తీయడం చాలా బాధ్యత కూడుకున్నది, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి వీరుడి కథ చెప్పినపుడు ఆ బాధ్యత ఇంకా పెరుగుతుంది. మేజర్ టీం మొత్తం ఆ భాద్యతని చక్కగా నిర్వహించారు.

Major: మేజర్ ట్రైలర్ వీక్షించిన డిఫెన్స్ మినిస్టర్

రెండేళ్లుగా మేజర్ టీమ్ నాకు థ్యాంక్స్ చెబుతున్నారు. కానీ ఇంత గొప్ప సినిమాని ఇచ్చిన మేజర్ టీమ్ కి నేను థ్యాంక్స్ చెప్పాలి. జూన్ 3న మేజర్ వస్తుంది. తప్పకుండా మీరు ప్రేమించే సినిమా అవుతుంది. అనురాగ్ మాట్లాడుతూ నేను రిస్క్ చేస్తానని చెప్పారు. కానీ నేను రిస్క్ చేయను. నాలుగేళ్లుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్ బస్టరే. అడవి శేష్ చేసే సినిమాలు నాకు చాలా ఇష్టం. మేజర్ సినిమా కూడా అద్భుతంగా ఉండబోతుంది.” అన్నారు. ఇక మేజర్ మూవీ ప్రెస్ మీట్ లో కృష్ణ గారి బయోపిక్ గురించి మీడియా అడగగా.. కృష్ణ గారి బయోపిక్ ఎవరైనా తీస్తే మొదటగా నేను చూసి సంతోషిస్తానని.. కానీ నేను నాన్న బయోపిక్ తియ్యలేనని అయన నా దేవుడు.. అవసరం అయితే ప్రొడ్యూస్ చేస్తానని సమాధానమిచ్చారు.