Bigg Boss 5: ఐదు వారాలకు హమీదా రెమ్యునరేషన్ ఎంతంటే?

అతిపెద్ద రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఐదు వారాలు ముగిసి ఆరవ వారంలో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోలో ఇంట్లో ప్రస్తుతం 14 మంది..

Bigg Boss 5: ఐదు వారాలకు హమీదా రెమ్యునరేషన్ ఎంతంటే?

Big Boss 5 (2)

Big Boss 5: అతిపెద్ద రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఐదు వారాలు ముగిసి ఆరవ వారంలో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోలో ఇంట్లో ప్రస్తుతం 14 మంది సభ్యులే ఉన్నారు. సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్ తొలి నాలుగు వారాలలో ఇంటి నుండి బయటకి వచ్చేయగా తాజాగా ఐదవ వారంలో హమీదాను బిగ్ బాస్ బయటకి తీసుకొచ్చేశాడు. బిగ్ బాస్ ఇంట్లో గ్లామర్ డాల్ గా క్యూట్ చూపులు.. ముద్దుముద్దు మాటలతో హమీదా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

Big Boss 5: ఈ వారం నామినేషన్‌లో పదిమంది.. ఎలిమినేట్ అయ్యేది ఎవరో?

అయితే.. ఇంట్లో ఉన్న వారిలో ఫ్యాన్ బేస్ తక్కువగా ఉండడంతో పాటు గేమ్ ఆడడం కన్నా శ్రీరామ్ వెనకపడడడం మీదనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న కారణంగానే హమీదా ఎలిమినేషన్ జరిగిపోయింది. హామీ ఎలిమినేషన్ తో శ్రీరామ్ ఇంట్లో ఒంటరిగా ఫీలవుతున్నాడు. అర్థరాత్రి శ్రీరామ్ నిద్రలో ఉలిక్కిపడి లేస్తుంటే మిగతా సభ్యులు ధైర్యం చెప్పి నిద్రపుచ్చుతున్నారు. అంతగా హమీదా ఎలిమినేషన్ తరువాత శ్రీరామ్ డిస్ట్రబ్ లో ఉన్నాడు. హమీదా ఎలిమినేషన్ సంగతి పక్కనపెడితే ఐదు వారాలకు ఆమెకి ఎంత రెమ్యునరేషన్ ముట్టిందన్నది ఆసక్తిగా మారింది.

Big Boss 5: ఫాఫం.. ఉన్న ఒక్క జంటను విడగొట్టేశారే!

బిగ్ బాస్ ఇంట్లో ఉన్నందుకు గాను హమీదా ఒక్క వారానికి 80 వేల నుంచి లక్ష రూపాయల మేరకు రెమ్యునరేషన్‌ తీసుకున్నట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ లెక్కన ఆమె ఐదు వారాలకు గానూ మొత్తం నాలుగున్నర లక్షలకు పైగానే తీసుకుని వెళ్ళి ఉంటుందని చెప్తున్నారు. హౌస్‌లో ఫుల్ గ్లామరస్‌గా కనిపించిన హమీదాకు ఈ మాత్రం రెమ్యునరేషన్ ఇవ్వడంలో తప్పేంలేదని అంటున్న బిగ్‌బాస్ వీక్షకులు.. మరికొన్ని రోజులు హమీదా ఇంట్లో ఉంటే ఇంకా బాగుండేదని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.