మోక్షజ్ఞతో ఫోటో గురించి నిహారిక మాటల్లో!

  • Published By: vamsi ,Published On : March 24, 2019 / 08:08 AM IST
మోక్షజ్ఞతో ఫోటో గురించి నిహారిక మాటల్లో!

ఒకప్పుడు నందమూరి కుటుంబంలో ఫంక్షన్ అయితే మెగా కుటుంబం… మెగా కుటుంబంలో ఫంక్షన్ అయితే నందమూరి సందడి చేయడం చూశాం. అయితే ఇటీవలికాలంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక రెండు కుటుంబాల మధ్య గొడవలు మీడియీలో ప్రముఖంగా వినిపించాయి. అయితే  చిరంజీవి, బాలకృష్ణ మాత్రం తాము మంచి మిత్రులమని చాటి చెబుతుంటారు. ఈ క్రమంలో నాగబాబు బాలకృష్ణ ఎవరో తనకు తెలియదు అన్న సంధర్భంలో.. కొంతమంది బాలకృష్ణ అభిమానులు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞతో నాగబాబు కుమార్తె నిహారిక ఉన్న ఫొటోలను ట్రోల్ చేశారు.
ఈ ఫోటోలకు సంబంధించి తాజాగా ‘సూర్యకాంతం’ సినిమా ప్రచారంలో భాగంగా నిహారిక వివరణ ఇచ్చింది. ‘‘డిగ్రీ కాలేజీలో మోక్షజ్ఞ నా జూనియర్ అని, అప్పుడే మోక్షజ్ఞ తనకు పరిచయం అని, ఆ ఫొటోలు అప్పుడు దిగినవని చెప్పింది. అయితే ఇప్పుడు అతను ఎక్కడున్నాడో కూడా నాకు తెలీదని అన్నారు. తన తండ్రి నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని, పెళ్లి అయ్యే వరకు నా జీవితం నా ఇష్టం. సినిమాలకు కూడా నేను ఒక్కదాన్నే వెళ్తానని చెప్పింది. పాప్‌కార్న్ షేర్ చేయడం కూడా తనకు ఇష్టం ఉండదు.’’ అని చెప్పుకొచ్చింది.