Shruti Haasan Post : కమల్ ఓటమి తర్వాత కుమార్తె శ్రుతిహాసన్ ఏమని పోస్ట్ పెట్టిందంటే?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయం (MNM) వ్యవస్థాపకుడు కమల్ హాసన్ తమిళనాడు కోయంబత్తూర్ (దక్షిణ) నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. కమల్ ఓటమి అనంతరం ఆయన పెద్ద కుమార్తె శ్రుతి హాసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన తండ్రి ఫొటోను షేర్ చేసింది.

Shruti Haasan Post : కమల్ ఓటమి తర్వాత కుమార్తె శ్రుతిహాసన్ ఏమని పోస్ట్ పెట్టిందంటే?

What Shruti Haasan Posted For Dad Kamal Haasan After Counting Of Votes

Shruti Haasan Post : తతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయం (MNM) వ్యవస్థాపకుడు కమల్ హాసన్ తమిళనాడు కోయంబత్తూర్ (దక్షిణ) నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. కమల్ ఓటమి అనంతరం ఆయన పెద్ద కుమార్తె శ్రుతి హాసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన తండ్రి ఫొటోను షేర్ చేసింది. 2018లో సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన తండ్రి ఫొటోను ఒకటి ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసింది. ‘నా అప్పా గురించి ఎల్లప్పుడూ నాకు గర్వంగా ఉంటుంది’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన తండ్రి ఫొటోను షేర్ చేసింది శ్రుతి హాసన్. ఆ పోస్టుకు #Terminator #TheFighter అనే హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Post Shruthi

గత ఏప్రిల్‌లో శ్రుతి, ఆమె చెల్లెలు అక్షర తమ తండ్రితో కలిసి పోలింగ్ బూత్‌కు వెళ్లి తమిళనాడు ఎన్నికలకు ఓటు వేశారు. ఓటు సమయం.. అనే క్యాప్షన్ తో హాసన్ కుటుంబం ఫొటోను శ్రుతి హాసన్ షేర్ చేసింది. ఆమె ఓటు వేసిన తరువాత ఆమె ఫొటోను కూడా ఇన్ స్టాలో షేర్ చేసింది. నేను ఆయన (మిస్టర్ హాసన్)తో పాటు వెళ్తున్నాను. నేను ఆయన కుమార్తెగా మద్దతు ఇవ్వడానికి వచ్చాను. అంతా సవ్యంగా జరుగుతుందని ఆశిస్తున్నానని శ్రుతి హాసన్ తెలిపింది.

ఏప్రిల్ 6న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నిన్న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 66 ఏళ్ల కమల్ హాసన్ ఓట్ల లెక్కింపు ప్రారంభంలోనే ముందున్నప్పటికీ, బీజేపీకి చెందిన వనతి శ్రీనివాసన్ ఎన్నికల్లో 1,500 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కమల్ హాసన్ మొత్తం ఓటింగులో మూడోవంతు (33.26 శాతం) సాధించాడు. వనతి శ్రీనివాసన్ 34.38 శాతం సాధించాడు.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)