Akshay Kumar: అక్కీ ఏం చేసినా ట్రెండే.. బయోపిక్స్‌కా బాద్ షా!

అక్షయ్ కుమార్ ఏం చేసినా అంతే.. ట్రెండ్ సెట్ అయిపోతుంది. ఆ మధ్య వరుసగా కామెడీ ఎంటర్ టైనర్స్ చేసిన అక్షయ్.. తర్వాత స్టోరీ ఓరియంటెడ్ మూవీస్ చేశాడు. ఇప్పుడు బయోపిక్స్ తో తనలోని..

Akshay Kumar: అక్కీ ఏం చేసినా ట్రెండే.. బయోపిక్స్‌కా బాద్ షా!

Akshay Kumar (1)

Akshay Kumar: అక్షయ్ కుమార్ ఏం చేసినా అంతే.. ట్రెండ్ సెట్ అయిపోతుంది. ఆ మధ్య వరుసగా కామెడీ ఎంటర్ టైనర్స్ చేసిన అక్షయ్.. తర్వాత స్టోరీ ఓరియంటెడ్ మూవీస్ చేశాడు. ఇప్పుడు బయోపిక్స్ తో తనలోని సీరియస్ యాంగిల్ ని చూపిస్తున్నాడు. 50 ఏళ్ల క్రితం పాకిస్తాన్ తో జరిగిన యుద్దంలో పోరాటవీరుడిగా మారబోతున్నాడు అక్షయ్. ఈ సినిమాతో పాటు ఇప్పటి వరకూ అక్షయ్ ఎన్ని బయోపిక్స్ చేశారో డీటెయిల్డ్ గా చూద్దాం.

Rashi Khanna: రాశీఖన్నా రెచ్చిపోయిన వేళ.. ఫోటోలు వైరల్!

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఏ సినిమా చేసినా కాసుల వర్షమే. ఒకప్పుడు మొనాటనస్ సినిమాలు చేసిన ఈ హీరో ఇప్పుడు వెరైటీకే ఓటేస్తున్నారు. బ్యాక్ టూ బ్యాక్ బయోపిక్స్ తో అదరగొడుతున్నాడు. 1971 ఇండో-పాక్ యుధ్దంలో వీరపోరాటయోధుడు మేజర్ ఇయాన్ కార్డోజో.. రియల్ లైఫ్ క్యారెక్టర్ తో గోర్ఖా సినిమా చేస్తున్నాడు అక్షయ్ కుమార్.

Liger: బాంబే బ్యూటీకి రౌడీహీరో ఫిదా.. అద్భుతమంటూ ప్రశంసల వర్షం!

అక్షయ్ కుమార్ కి బాలీవుడ్ లో బయోపిక్స్ కా బాద్ షా అనే పేరుంది. ఇప్పటి వరకూ అక్షయ్ కుమార్ చేసిన బయోపిక్స్ అన్నీ సూపర్ హిట్సే. ఎయిర్ లిఫ్ట్ సినిమాలో రంజిత్ కతియాల్ అనే రియల్ లైఫ్ క్యారెక్టర్ చేసి సూపర్ హిట్ కొట్టిన అక్షయ్.. నానావతి లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన రుస్తుమ్ సినిమాలో మరో బయోపిక్ తో సక్సెస్ దక్కించుకున్నాడు. తన భార్య కోసం ఎకనామికల్ శానిటరీ ప్యాడ్స్ తయారు చేసిన అరుణా చలం మురుగన్ అనే వ్యక్తి బయోపిక్ ఆధారంగా ప్యాడ్ మ్యాన్ తీసి తన స్టైలే వేరని ప్రూవ్ చేసుకున్నాడు అక్షయ్ కుమార్.

Romantic: నో డౌట్.. ఇది మ్యాడ్లీ లవ్.. రొమాంటిక్ ట్రైలర్ అదిరిందంతే!

మన దేశానికి హాకీలో గోల్డ్ మెడల్ అందించాలని తపన పడే లెజండరీ ఇండియన్ హాకీ ప్లేయర్ కిషన్ లాల్ బయోపిక్ ఆధారంగా తీసిన గోల్డ్ సినిమాలో అక్షయ్ కుమార్ తన బెస్ట్ అందించాడు. సిక్కుపోరాట యోధుడు హవీల్దార్ ఇషార్ సింగ్ గా… కేసరి సినిమాలో ఎమోషనల్ గా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు అక్షయ్. రాజుగా పృధ్విరాజ్ చౌహాన్ హీరోయిజం చూపిస్తూ.. ఆయన జీవితాన్ని స్క్రీన్ మీద పృధ్విరాజ్ మూవీలో చూపించబోతున్నాడు అక్షయ్.