RRR: ఇక మిగిలింది జక్కన్నే.. రిలీజ్ డేట్ ఎప్పుడు?

టాలీవుడ్ లో సినిమా జాతర మొదలైంది. ఏడాది కాలంగా కరోనాతో తమ సినిమాలు బయటకి ఎప్పుడు తీసుకురావాలా అని ఎదురుచూసిన వాళ్లంతా ఇప్పుడు ఇక ఇబ్బంది లేదు తమ సినిమా వచ్చేస్తుందని..

10TV Telugu News

RRR: టాలీవుడ్ లో సినిమా జాతర మొదలైంది. ఏడాది కాలంగా కరోనాతో తమ సినిమాలు బయటకి ఎప్పుడు తీసుకురావాలా అని ఎదురుచూసిన వాళ్లంతా ఇప్పుడు ఇక ఇబ్బంది లేదు తమ సినిమా వచ్చేస్తుందని విడుదల తేదీలు ఖరారు చేసుకుంటున్నారు. దాదాపుగా చివరి దశలో ఉన్న సినిమాలు, ఇప్పటికే పూర్తయిన అందరి స్టార్ హీరోల సినిమాలు విడుదల తేదీలు ఫిక్స్ చేసుకున్నాయి. ఇందులో కొన్ని ఈ ఏడాది చివర క్రిస్టమస్ టార్గెట్ చేస్తే.. మరికొందరు వచ్చే సంక్రాంతికి స్లాట్స్ బుక్ చేసుకున్నారు.

Big Boss 5: ఈ వారం నామినేషన్‌లో 8 మంది.. ఎలిమినేట్ అయ్యేది ఇతనే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా వచ్చేందుకు కూడా డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. డిసెంబర్ 17న పుష్ప విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించారు. కానీ, ఈ మధ్య ఈ తేదీపై అనుమానాలు నెలకొన్నాయి. కానీ సుకుమార్ అండ్ కో మాత్రం చెప్పిన తేదీకి వచ్చేస్తామని ధీమాగా చెప్పారు. ఇప్పటికే సర్కారు వారి పాట నుండి చాలామంది స్టార్ హీరోలు కూడా రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ, ఆర్ఆర్ఆర్ మాత్రం విడుదల తేదీ ఎప్పుడన్నది ఇంకా ప్రకటించలేదు.

RRR: ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్?

ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఆర్ఆర్ఆర్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎన్నో వాయిదాలు పడిన ఆర్ఆర్ఆర్ త్వరలోనే వస్తుందని మాత్రమే చెప్పారు కానీ తేదీని నిర్ణయించలేదు. అయితే, మిగతా సినిమాలన్నీ విడుదల తేదీలు ప్రకటిస్తూ రాజమౌళి నుండి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో అభిమానులంతా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ విడుదల ఎప్పుడని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దసరా కానుకగా ఏదైనా స్పెషల్ ట్రీట్ ఉండే అవకాశం ఉందని, విడుదల తేదీ కూడా ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు.