NTR30: కొత్త సినిమా మొదలెప్పుడు తారక్.. అభిమానుల ఆవేదన!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ కొత్త సినిమా సెట్స్ మీదకి వెళ్ళేది ఇప్పుడా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తారక్ కొత్త సినిమా అఫీషియల్ గా సెట్స్ మీదకి వెళ్లనుందని..

NTR30: కొత్త సినిమా మొదలెప్పుడు తారక్.. అభిమానుల ఆవేదన!

Ntr30

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ కొత్త సినిమా సెట్స్ మీదకి వెళ్ళేది ఇప్పుడా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తారక్ కొత్త సినిమా అఫీషియల్ గా సెట్స్ మీదకి వెళ్లనుందని నెల రోజుల క్రితం నుండే ప్రచారం జరుగుతుంది. కానీ.. రోజులు గడుస్తున్నా సినిమా మాత్రం సెట్స్ మీదకి వెళ్లడం లేదు. హీరోయిన్ డైలమాలో అని కొన్నాళ్ళు అనుకున్నా ఇప్పుడు అలియా భట్ అని ఫిక్సయింది. బౌండ్ స్క్రిప్ట్ కూడా సిద్ధమైందని దాని కోసం ముగ్గురు బడా రచయితలు తీర్చిదిద్దారని కూడా చెప్పుకున్నారు.

Minister Perni Nani: ఎన్టీఆర్ సినిమా గురించి ఏనాడైనా ట్వీట్ చేశారా.. లోకేష్‌కు నాని కౌంటర్!

అన్నీ ఉన్నా ఎందుకో తారక్ కొత్త సినిమా మాత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు. ఆర్ఆర్ఆర్ కోసం మూడేళ్లు కేటాయించిన తారక్ ఇప్పుడు ఆ గ్యాప్ ఫిల్ చేసేందుకు వరస సినిమాలు చేయనున్నాడని.. ఒక సినిమా సెట్స్ లో ఉండగానే ప్యార్లల్ గా మరో సినిమా కూడా షూట్ మొదలు పెడతారని కూడా కథనాలొచ్చాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అట్లీ, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబులతో వరసగా పాన్ ఇండియా లెవెల్ సినిమాలనే ప్లాన్ చేసుకున్నాడు.

NTR30: కొరటాలతో తారక్ సినిమా.. అసలు కథ ఇదేనా?

ఇందులో ముందుగా కొరటాల శివ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. కానీ అది మాత్రం షూటింగ్ మొదలు కావడం లేదు. మార్చి 25న క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది. మార్చి ఫస్ట్ వీక్ నుండి మళ్ళీ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు కానున్నాయి. దీంతో ఆ నెల మొత్తం తారక్ ఆ సినిమాకే కేటాయించాల్సి వస్తుంది. అందుకే కొరటాల సినిమా ఆర్ఆర్ఆర్ తర్వాతే మొదలు పెట్టేందుకు వాయిదా వేసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. అభిమానులేమో తమ హీరో సినిమా ఎప్పుడు వస్తుందా.. కొత్త సినిమా మొదలయ్యేది ఎప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Jr NTR: తారక్ తో పరుశురాం మల్టీస్టారర్.. రెండో హీరో ఎవరు?

సీనియర్ హీరోలు చిరంజీవి, రవితేజ నుండి స్టార్ హీరోలు ప్రభాస్, రామ్ చరణ్ కూడా ఒకటికి నాలుగైదు సినిమాలను సెట్స్ మీదకి తీసుకెళ్తుంటే ఎన్టీఆర్ మాత్రం ఎందుకిలా నిదానమే ప్రధానం అనేలా ఉన్నారని తారక్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చే క్రేజ్ ముందు ఈ గ్యాప్ పెద్ద విషయం కాదని.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ సినిమాల దండయాత్ర మొదలవుతుందని కొందరు అభిమానులు వాళ్ళకి వాళ్ళే సమాధానం చెప్పుకుంటున్నారు.