రాధే శ్యామ్ వచ్చేది ఎప్పుడో

రాధే శ్యామ్ వచ్చేది ఎప్పుడో

Radhe Shyam Film : రాధేశ్యామ్ వస్తున్నాడు.. వచ్చేస్తున్నాడు.. అని ఊరిస్తూనే ఉన్నారు డైరెక్టర్. ఇంకెప్పుడు వచ్చేది..? వస్తాడని చూసి చూసి ఇప్పటికే విసుగొచ్చేసిందని అంటున్నారు ఫ్యాన్స్ . ఒక పక్క అదిగో ఇదిగో అంటూ సినిమా మీద హైప్స్ పెంచే ప్రయత్నం చేస్తున్న రాదేశ్యామ్ టీమ్ కి.. ఈ సంవత్సరం అయినా వస్తాడా అంటూ రివర్స్ కౌంటర్స్ ఇస్తున్నారు ఫ్యాన్స్. ఇంతకీ రాధేశ్యామ్ వచ్చేది ఎప్పుడు ..?
రాధేశ్యామ్ .. ప్రభాస్-పూజా జంటగా మోస్ట్ ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

అసలే ప్రభాస్ ..ఆ పై ప్యాన్ ఇండియా సినిమా. మరి ఆ మాత్రం ఎక్స పెక్టేషన్స్ ఉండవా.? రెండేళ్ల నాడు మొదలు పెట్టిన సినిమా.. అదిగో వస్తోంది ఇదిగో వస్తోందని ఓ ఊదరగొడుతున్నారు తప్పించి అసలు వచ్చేదెప్పుడు అని విసుక్కుంటున్నారు ఆడియన్స్. ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్ లో రాధేశ్యామ్ చేస్తోన్న ప్రభాస్.. ఎట్టి పరిస్థితుల్లో సినిమాని ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా సినిమాల్ని కంప్లీట్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటలీ, జార్జియా లోని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ యాక్షన్ ను పక్కన పెట్టి లవర్ బాయ్ గా మళ్లీ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యబోతున్నారు.

అటు రొమాన్స్ తో పాటు ప్రభాస్ తన ప్రతి సినిమాలో యాక్షన్ రేంజ్ ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు. రాధాకృష్ణ డైరెక్షన్లో పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న పీరియాడికల్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ అనౌన్స్ చేసినప్పుడు యాక్షన్ పక్కన పెట్టి రొమాన్స్ లోకి దిగారు అనుకున్నారు అందరూ. కానీ ఫ్యాన్స్ కి విజువల్ ఫీస్ట్ ఇవ్వడానికి ప్రభాస్ నెవర్ బిఫోర్ యాక్షన్ తో పెద్ద యాక్షన్ ఎపిసోడ్స్ కంప్లీట్ చేసినట్టు చెప్పారు డైరెక్టర్ రాధాకృష్ణ.