White Paper: మెగా బ్రదర్ చేతులమీదుగా వైట్ పేపర్ ఫస్ట్ లుక్!

జీఎస్‌కే ప్రొడక్షన్స్ పతాకంపై శివ దర్శకత్వంలో గ్రంధి శివ ప్రసాద్ నిర్మిస్తున్నసినిమా "వైట్ పేపర్"

White Paper: మెగా బ్రదర్ చేతులమీదుగా వైట్ పేపర్ ఫస్ట్ లుక్!

Naga Babu

White Paper: జీఎస్‌కే ప్రొడక్షన్స్ పతాకంపై శివ దర్శకత్వంలో గ్రంధి శివ ప్రసాద్ నిర్మిస్తున్నసినిమా “వైట్ పేపర్”(White Paper). ప్రభాస్ హీరో‌గా నటించిన ఫస్ట్ సినిమా ఈశ్వర్‌లో ప్రభాస్ ఫ్రెండ్‌గా నటించిన కమెడియన్ అభినయ కృష్ణ, జబర్దస్త్ అదిరే అభి హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కేవలం 9గంటల 51నిమిషాల్లో షూటింగ్ పూర్తి చేసుకుని, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అరుదైన చిత్రంగా పేరు దక్కించుకుంది.

ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన అనంతరం మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.. “వైవిధ్యమైన కథనాలు ఎంచుకోవడంలో మా అభి ముందుంటాడు. ఇప్పుడు ఈ వైట్ పేపర్ సినిమాని కూడా డిఫరెంట్‌గా చేశాడు. ఫస్ట్ లుక్‌లో అభిని చూస్తుంటే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌లా ఉన్నాడు. అభి అండ్ వాళ్ళ టీమ్ పడిన కష్టానికైనా ఈ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

హీరో అభి మాట్లాడుతూ.. ”టైటిల్ లుక్ విడుదలైనప్పటి నుంచే సినిమాపై అంచనాలు పెరిగాయి. సినిమా కోసం చాలా కష్టపడ్డాము. నాగబాబు గారు మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసి ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు

డైరెక్టర్ శివ మాట్లాడుతూ “సస్పెన్స్ కథనంతో తెరకెక్కిన ఈ సినిమాలో అభి చాలా బాగా నటించారు. నాగబాబు గారి బ్లెస్సింగ్స్ మాకు చాలా సంతోషం కలిగించింది. పెద్దలంతా మా సినిమాని , మేము చేసిన ప్రయోగాన్ని మెచ్చుకుంటున్నారు. సంతోషంగా అనిపిస్తుంది” అని అన్నారు. ఈ సినిమాలో అదిరే అభి(అభినయ కృష్ణ), వాణి, తల్లాడ సాయి కృష్ణ, నేహా, నంద కిషోర్ తదితరులు నటించారు.

Abhi

Abhi