Tollywood Heroins: ఎవరికి వాళ్ళే హాట్ ట్రెండ్.. ఒక్కొక్కరు ఒక్కోలా దూకుడు! Who are they hot trend for .. Tollywood Heroins everyone is aggressive!

Tollywood Heroins: ఎవరికి వాళ్ళే హాట్ ట్రెండ్.. ఒక్కొక్కరు ఒక్కోలా దూకుడు!

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఒక్కొక్కరూ ఒక్కోలా దూసుకుపోతున్నారు. సౌత్ సినిమాలపై ఫోకస్ చేస్తూ బాలీవుడ్ కలలు ఒకరు కంటుంటే.. వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనేది మరొకరి డిమాండ్.

Tollywood Heroins: ఎవరికి వాళ్ళే హాట్ ట్రెండ్.. ఒక్కొక్కరు ఒక్కోలా దూకుడు!

Tollywood Heroins: టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఒక్కొక్కరూ ఒక్కోలా దూసుకుపోతున్నారు. సౌత్ సినిమాలపై ఫోకస్ చేస్తూ బాలీవుడ్ కలలు ఒకరు కంటుంటే.. వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనేది మరొకరి డిమాండ్. ఓ భామ గోల్డెన్ లెగ్ అనిపించుకుంటుంటే.. మరో అందగత్తె ఒక్క రిలీజ్ అంటూ వెయిట్ చేస్తోంది. ఒక్కో హీరోయిన్ ఒక్కోలా దూకుడు చూపిస్తూ హాట్ ట్రెండ్ అవుతున్నారు టాలీవుడ్ లో.

New Villains: హైలెట్‌గా విలనిజం.. అందుకోసమే స్టైలిష్ స్టార్స్!

నిజానికి ఇంకా జూనియరే కృతిశెట్టి. కానీ సీనియర్ అందగత్తెలతో పోటాపోటీగా దూసుకుపోతుంది. గోల్డెన్ లెగ్ అనిపించుకుంటుంది. అడుగుపెడితే అదరాల్సిందే అన్నట్టుంది కృతి వరుస. ఉప్పెనతో ఏ ముహూర్తన ఇండస్ట్రీలో అడుగుపెట్టిందో కానీ వరుస హిట్స్ తో ఒక్క సంవత్సరంలోనే గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చేసుకుంది. ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్.. ఆ సినిమా రిలీజ్ కాకముందే ఆఫర్స్ తో లైనప్. ఇప్పుడు చూస్తే వరుస హిట్స్. అవును 2021 ఎండింగ్ లో శ్యామ్ సింగ రాయ్, సంక్రాంతికి బంగార్రాజు హిట్స్ ను తన అకౌంట్ లో వేసుకుంది కృతిశెట్టి. ప్రెజెంట్ రామ్ ది వారియర్ మూవీతో పాటూ సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాల్లో నటిస్తోంది. మరికొన్ని సినిమాలకు త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది. బట్ ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా పెరిగింది మరి.

Varun Tej-Lavanya Tripathi: వరుణ్‌తో లవ్ ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన లావణ్య!

పుష్పతో నేషనల్ క్రష్.. క్రష్మిక యూత్ ఫేవరేట్ అయిపోయింది. సామీ సామీ అంటూ సౌత్ టు నార్త్ యంగ్ హృదయాలను కొల్లగొట్టింది. పుష్ప2, ఆడవాళ్లు మీకు జోహార్లు లో నటిస్తున్న రష్మిక… అటు బాలీవుడ్ లో మిషన్ మజ్నూ, గుడ్ బై సినిమాలు చేసేస్తుంది. ఇప్పుడు 3 కోట్ల వరకు డిమాండ్ చేసి కొత్త సినిమాలకు సైన్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ ఫిమెల్ సెంట్రిక్ మూవీతో పాటూ అనుదీప్ – శివకార్తీకేయన్ మూవీలోనూ రష్మికనే సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అన్నింటికంటే కొరటాల కాంబో మూవీలో తారక్ సరసన రష్మిక సైన్ చేసిందనే వార్త బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు.

Shyam Singha Roy: ఈ శుక్రవారం నుండే ఓటీటీలో శ్యామ్ సింగరాయ్!

కీర్తి సురేశ్ యవ్వారం వేరేలా ఉంది. మెగాస్టార్ సిస్టర్ గా భోళాశంకర్ లో నటిస్తున్న కీర్తి.. అటు మహేశ్ సర్కారు వారి పాటను సెట్స్ పై ఉంచింది. నాని దసరా సినిమాలో తెలంగాణ పిల్లగా కనిపించబోతుంది. హీరోయిన్ గానే చేయాలనే మడి కట్టుకుని కూర్చోకుండా క్యారెక్టర్ నచ్చితే చాలు సై అనేస్తుంది కీర్తి. అందులో భాగంగానే సాని కాయిదాంలో నెగెటివ్ క్యారెక్టర్.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ సరసన మరో రోల్ కి సైన్ చేసింది. మలయాళంలో టోవినో థామస్ సరసన మరో మూవీకి కమిట్మెంట్ ఇచ్చిన మహానటి నుంచి గుడ్ లక్ సఖికి మాత్రం మోక్షం రావట్లేదు.

Mahesh Babu: తగ్గేదేలే.. స్టార్ డైరెక్టర్స్‌ను లైన్‌లో పెట్టేసిన మహేష్!

సమంతా, పూజా హెగ్డే.. బాలీవుడ్ పైనే ఫుల్ ఫోకస్ చేసిన వీళ్లిద్దరి కథ వేరేలా ఉంది. పాన్ ఇండియా సినిమాలు చేసిన పూజా హెగ్డేకి కొవిడ్ అడ్డుకట్ట వేస్తుంటే.. ఇదే కొవిడ్ టైమ్ లో పీక్స్ చేరిన ఇమేజ్ తో రచ్చ చేస్తుంది సమంతా. ఊ అంటావా సాంగ్ కు సామ్ 5కోట్లు తీసుకుందనే వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నార్త్ లో అటెక్షన్ కోసమే సామ్ ఇలా చేస్తుందనేవారూ ఉన్నారు. ఏదేమైనా తమిళ్, తెలుగు మూవీ కాదువాక్కుల రెండు కాదల్ తో పాటూ పాన్ ఇండియా ఫిల్మ్ శాకుంతలం పూర్తి చేసిన సామ్.. యశోదతో పాటూ అరెంజ్ మెంట్స్ ఆప్ లవ్ వంటి డిఫరెంట్ సినిమాల్లో నటిస్తోంది. అటు ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత డైరెక్ట్ బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తుంది.

Deepthi Sunaina: లంగా ఓణీలో దీప్తి సునయన క్యూట్ లుక్స్!

హీరోయిన్ తాప్సీ నిర్మాతగా సమంతాను బాలీవుడ కు డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేస్తుందనే వార్తలొచ్చాయి కానీ యశ్ రాజ్ ఫిల్మ్స్ తో మూడు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. స్టార్ హీరోలతో సినిమాలు చేసే అగ్ర నిర్మాణసంస్థతో డీల్ అంటే సామ్ దశ తిరిగినట్టే. అంతేకాదు.. సమంత మరో వెబ్ సిరీస్ చేయబోతున్నట్టు టాక్. ఆ వెబ్ సిరీస్ లుక్ కోసమే జిమ్‏లో తెగ కష్టపడిపోతున్నట్టు చెప్తున్నారు. ఎవరో కాదు ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకేలే సామ్ తో మరో సిరీస్ చేయనున్నారని తెలుస్తోంది. వరుణ్ ధావన్ ఇందులో ఆమెకి పెయిర్ గా కనిపించే ఛాన్స్ ఉంది.

Star’s Negative Rolls: హీరోలే విలన్లు.. విలన్లే హీరోలు!

రిలీజ్ ఎప్పుడా అని ఎదురుచూస్తోంది బుట్టబొమ్మ. చేతిలో పెద్ద పెద్ద సినిమాలున్నా కొవిడ్ కారణంగా అవి పోస్ట్ పోన్ అవుతున్నాయి. గ్లోబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ పై ఆశలు పెట్టుకుంటే.. అదికాస్త వాయిదాపర్వం కొనసాగిస్తుంది. ఆచార్యలో స్పెషల్ రోల్ చేస్తే అదీ ఏప్రిల్ 1కి షిఫ్ట్ అయింది. విజయ్ బీస్ట్ ని నమ్ముకుంటే.. ఆ సినిమా సైతం ఏప్రిల్ కి వాయిదాపడింది. అటు బాలీవుడ్ సర్కస్ మూవీది ఇదే పరిస్థితి. సల్మాన్ ఖాన్ హీరోగా భాయ్ జాన్ సినిమా త్వరలో షూటింగ్ మొదలు కాబోతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న భాయ్ జాన్ లో బుట్టబొమ్మే హీరోయిన్. త్రివిక్రమ్ – మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాలో కూడా పూజా హెగ్డేనే హీరోయిన్ గా ఫిక్సయింది. ఇలా అటు సౌత్, నార్త్ ఇండస్ట్రీలకు సమానంగా స్పేస్ ఇస్తున్న పూజా సినిమాలు వరుసగా రిలీజైతే 2022 ఆమెదే అనిపించుకోవడం ఖాయం.

×