Chiranjeevi : మెగాస్టార్‌కి ఎవరు మెగా హిట్ ఇస్తారు??

చిరంజీవికి ఖైదీ నెం.150 తర్వాత ఆయన రేంజ్ కి తగ్గ హిట్ రాలేదు. కొరటాల శివతో ఆచార్య అయినా బ్లాక్ బస్టర్ అవుతుందనుకుంటే, ఆ సినిమా ఫ్లాప్ గానే మిగిలింది. ఆ ఎఫెక్ట్ తర్వాత డైరెక్టర్ల మీద పడింది. ఇప్పుడు మెగాస్టార్..................

Chiranjeevi : మెగాస్టార్‌కి ఎవరు మెగా హిట్ ఇస్తారు??

Megastar Chiranjeevi

Chiranjeevi :  చిరంజీవికి ఖైదీ నెం.150 తర్వాత ఆయన రేంజ్ కి తగ్గ హిట్ రాలేదు. కొరటాల శివతో ఆచార్య అయినా బ్లాక్ బస్టర్ అవుతుందనుకుంటే, ఆ సినిమా ఫ్లాప్ గానే మిగిలింది. ఆ ఎఫెక్ట్ తర్వాత డైరెక్టర్ల మీద పడింది. ఇప్పుడు మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లన్నీ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులుగా మారిపోయాయి. ప్రస్తుతం చిరంజీవి చేతిలో మూడు సినిమాలు షూటింగ్ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్నాయి. మోహన్ రాజ డైరెక్షన్ లో గాడ్ ఫాదర్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాతో సల్మాన్ ఖాన్ తెలుగు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ పైన భారీ హోప్స్ పెట్టుకున్నారు మెగాస్టార్.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి జూన్ 10న మలేషియా వెళ్తున్నారు. అక్కడ బాబి డైరెక్షన్ లో 154వ సినిమా షూటింగ్ లో 4 రోజులపాటు పాల్గొంటున్నారు. ఆ తర్వాత తిరిగొచ్చాక జూన్ 21 నుంచి హైదరాబాద్ లోనే మెహర్ రమేశ్ డైరెక్షన్ లో బోళా శంకర్ సినిమా షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొంటారు. అజిత్ నటించిన తమిళ్ మూవీ వేదాలంకు తెలుగు రీమేక్ బోళా శంకర్. ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తుండగా, చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తంది.

Lokesh Kanagaraj : ఖైదీ, మాస్టర్, విక్రమ్….. వాట్స్ నెక్స్ట్ లోకేష్ కనగరాజ్??

భారీ బడ్జెట్ తో సినిమాలు చేసే మెహర్ రమేశ్ కు ఇప్పటి వరకూ ఒక్క హిట్ కూడా లేదు. అయినా మెహర్ రమేశ్ మేకింగ్ స్టయిల్ నచ్చి, చిరంజీవి వేదాలంకు తెలుగు రీమేక్ అయిన బోళాశంకర్ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అప్పగించారు. దాంతో ఖచ్చితంగా ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేయాల్సిన లైఫ్ అండ్ డెత్ చాలెంజ్ మెహర్ రమేశ్ కి ఎదురైందనే చెప్పాలి. ఆల్రెడీ 40 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో చిరంజీవి లుక్ ఫ్యాన్స్ నే కాదు, ఆడియన్స్ నూ ఎట్రాక్ట్ చేస్తుంది. మొత్తానికి మోహన్ రాజా, బాబి, మెహర్ రమేశ్ ఈ ముగ్గురు డైరెక్టర్స్ లో ఎవరు చిరంజీవికి గ్రాండ్ సక్సెస్ ఇస్తారో చూడాలి.