Bigg Boss 5 : బిగ్ బాస్ లో అందరి కంటే వరస్ట్ ఎవరు??

ఈ వారం కొత్త కెప్టెన్ గా విశ్వ ఎన్నికయ్యాడు. మొన్నటి దాకా కంటెస్టెంట్స్ ని నాలుగు టీంలుగా విడగొట్టడంతో ప్రతి టీం మధ్యలోను గొడవలు అయ్యాయి. కెప్టెన్ ఎంపిక అయిపోవడంతో గొడవలు కొంచెం

Bigg Boss 5 : బిగ్ బాస్ లో అందరి కంటే వరస్ట్ ఎవరు??

Bb

Bigg Boss 5 :  బిగ్ బాస్ గొడవలతో రోజు రోజుకి మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఈ సీజన్ 5 చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. ఈ వారం కొత్త కెప్టెన్ గా విశ్వ ఎన్నికయ్యాడు. మొన్నటి దాకా కంటెస్టెంట్స్ ని నాలుగు టీంలుగా విడగొట్టడంతో ప్రతి టీం మధ్యలోను గొడవలు అయ్యాయి. కెప్టెన్ ఎంపిక అయిపోవడంతో గొడవలు కొంచెం తగ్గుతాయి అనుకున్నారు. కానీ బిగ్ బాస్ ఊరుకోడుగా. సభ్యుల మధ్య గొడవలు పెట్టే టాస్క్ లు ఇస్తూ ఉంటాడు. ఇవాళ రాబోయే ఎపిసోడ్ లో కూడా ఇలాంటి టాస్క్ ఇచ్చాడు. హౌస్ లో ఎవరు వరస్ట్ అని అందర్నీ చెప్పమన్నారు. అయితే ఇది ఒక టాస్క్ లా ఇచ్చారు.

Chiranjeevi : చిరంజీవి కోసం నిన్నటి దాకా తండ్రి.. నేడు తనయుడు..

అందరికి వైట్ షర్ట్స్ ఇచ్చారు. వరస్ట్ అనే స్టాంప్ ని, రెడ్ పెయింట్ ని పెట్టారు. హౌస్ లో ఉన్న సభ్యులంతా ఎవరు ఎవరికి వరస్ట్ అనిపించారో వాళ్ళకి ఆ వరస్ట్ అనే స్టాంప్ తో వాళ్ళు వేసుకున్న వైట్ షర్ట్ మీద స్టాంప్ వేయాలి అని చెప్పారు. దీంతో మళ్ళీ ఒక్కొక్కరి మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ప్రోమోలో అందరివీ చూపించలేదు కానీ గట్టిగానే వాగ్వాదం జరిగినట్టు తెలుస్తున్నాయి.

Mahesh babu : రాజమౌళి సినిమాతోనే పాన్ ఇండియా ఎంట్రీ : మహేష్

కెప్టెన్ విశ్వ రవి సరిగ్గా రూల్స్ పాటించట్లేదు, రూల్స్ బ్రేక్ చేస్తున్నాడంటూ రవి పై వరస్ట్ స్టాంప్ వేశాడు. దీంతో రవి సీరియస్ అయి నేను రూల్స్ బ్రేక్ చేస్తే నీకేమన్నా ప్రాబ్లమ్ వచ్చిందా అని అడిగాడు. కాజల్ కూడా రవిని టార్గెట్ చేసి నీ వల్ల బిగ్ బాస్ నన్ను తిట్టాడు కాబట్టి నీకే వరస్ట్ ఇస్తాను అని రవి పై స్టాంప్ వేసింది. ఇక రవి ఈ వారం జెస్సి అసలు ఆడలేదు అని జెస్సి షర్ట్ కి వరస్ట్ స్టాంప్ వేశాడు. జెస్సి నవ్వుకుంటూనే అది నా ప్రాబ్లమ్ కాదు మీ ప్రాబ్లమ్ అని సెటైర్ వేశాడు. సన్నీ, విశ్వ సిరిని టార్గెట్ చేసి బిహేవియర్ నచ్చలేదంటూ, యాటిట్యూడ్ నచ్చలేదంటూ వరస్ట్ స్టాంప్ ఇచ్చారు. అనీ మాస్టర్ లోబోకి వరస్ట్ స్టాంప్ ఇచ్చింది. మరి మిగిలిన వాళ్ళు ఎవరికీ ఇచ్చారు అంటే ఇవాళ నైట్ ఎపిసోడ్ చూడాల్సిందే.