Krrish 4 : క్రిష్ 4.. డైరెక్టర్ మారనున్నాడా? ఏకంగా హాలీవుడ్ డైరెక్టర్??

కొంత కాలంగా బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ కు సక్సెస్ పరంగా కలిసిరావడం లేదు. ఎన్నో హోప్స్ పెట్టుకొని ఇటీవల రిలీజయిన ‘విక్రమ్ వేదా’ కలెక్షన్స్ విషయంలో బాగా డిజప్పాయింట్ చేసింది. ఈ సారి ఓ సాలిడ్ హిట్ తో మళ్ళీ ట్రాక్ మీదకు రావాలని చూస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘క్రిష్ 4’ పైనే..........

Krrish 4 : క్రిష్ 4.. డైరెక్టర్ మారనున్నాడా? ఏకంగా హాలీవుడ్ డైరెక్టర్??

who will be the director for Hrithik Roshan Krrish 4 Movie in Bollywood

Krrish 4 :  బాలీవుడ్ క్రేజీ సిరీస్ లో ‘క్రిష్’ ముందు వరుసలో ఉంటుంది. తనయుడు హృతిక్ రోషన్ హీరో తండ్రి రాకేశ్ రోషన్ డైరెక్టర్ గా ఈ సిరీస్ ఇప్పటివరకు ప్రేక్షకులని మెప్పించింది. ఈ ఫ్రాంచైజీలో ఇంత వరకూ మూడు సినిమాలొచ్చాయి. మూడూ సూపర్ హిట్సే. రీసెంట్ గా నాలుగో సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమా డైరెక్టర్ విషయంలో తండ్రీ కొడుకుల మధ్య ఒక యుద్ధమే జరుగుతోందని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

కొంత కాలంగా బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ కు సక్సెస్ పరంగా కలిసిరావడం లేదు. ఎన్నో హోప్స్ పెట్టుకొని ఇటీవల రిలీజయిన ‘విక్రమ్ వేదా’ కలెక్షన్స్ విషయంలో బాగా డిజప్పాయింట్ చేసింది. ఈ సారి ఓ సాలిడ్ హిట్ తో మళ్ళీ ట్రాక్ మీదకు రావాలని చూస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘క్రిష్ 4’ పైనే కొడుకు హృతిక్, తండ్రి రాకేశ్ కసరత్తులు చేస్తున్నారు. మూడో భాగం కన్నా సమ్ థింగ్ స్పెషల్ అనదగ్గ స్టోరీని తయారుచేయడంలో బిజీగా ఉన్నారు ఇద్దరూ.

రాకేష్ రోషన్ డైరెక్టర్ గా పక్కకు తప్పుకోవడంతో ఒక పక్క తండ్రితో స్ర్కిప్ట్ వర్క్ లో పార్టిసిపేట్ చేస్తూనే మరో పక్క డైరెక్టర్ ను సెలెక్ట్ చేసే పనిలో పడ్డాడు హృతిక్. తన టీమ్ ఐదారుగురు హాలీవుడ్ డైరెక్టర్స్ లిస్ట్ ప్రిపేర్ చేయగా రాకేశ్ రోషన్ మాత్రం దానికి ‘నో’ చెబుతున్నారని టాక్. బాలీవుడ్ డైరెక్టర్స్ ను కాదని, హాలీవుడ్ కు వెళ్ళడం సరికాదని హృతిక్ తో ఆయన వాదిస్తున్నాడని తెలుస్తోంది. అయితే ‘క్రిష్’ లాంటి సూపర్ హీరో మూవీని మరింత అడ్వాన్స్డ్ వెర్షన్ లో తెరకెక్కించాలంటే హాలీవుడ్ మేకర్స్ అయితేనే బెటరన్నది హృతిక్ ఆలోచన.

Balakrishna : మరో యాడ్‌తో బాలయ్య.. ధగధగ మెరిసిపోతున్నాడుగా..

అయినా దానికి తండ్రి రాకేశ్ ఒప్పుకోవడం లేదని సమాచారం. ఈ విషయంపై ఇద్దరి మధ్య సీరియస్ గా డిస్కషన్స్ జరుగుతున్నట్లు బాలీవుడ్ సమాచారం. ఇంతకు ముందొచ్చిన ‘క్రిష్’ సీరీస్ లోని మూడు భాగాలకు డైరెక్టర్ రాకేశ్ రోషనే. ఇప్పుడు నాలుగో భాగానికి డైరెక్టర్ విషయంలో తండ్రి కొడుకుల మధ్య క్లాష్ రావడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఎవరి మాట నెగ్గి క్రిష్ 4కు ఎవరు డైరెక్టర్ అవుతారో చూడాలి.