బిగ్ బాస్ 'సీజ‌న్‌ 3' హోస్ట్‌గా ఎవ‌రు రాబోతున్నారు..?

బిగ్ బాస్ ‘సీజ‌న్‌ 3’ హోస్ట్‌గా ఎవ‌రు రాబోతున్నారు..?

బిగ్ బాస్  ‘సీజ‌న్‌ 3’ హోస్ట్‌గా ఎవ‌రు రాబోతున్నారు..?

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో మంచి హిట్ అయిన సంగ‌తి అందరికి తెలిసిందే. సీజ‌న్‌ 1లో ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌గా, సీజ‌న్‌ 2లో నాని చేశారు. ఇక సీజ‌న్ 3 ఎప్పుడు మొద‌ల‌వుతుంది, హోస్ట్ ఎవ‌రు అనే దానిపై కొన్నాళ్ళుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. సీజ‌న్‌ 1లో ఎన్టీఆర్ అన్నీ తానై న‌డిపించి మంచి స‌క్సెస్ చేయ‌డంతో సీజ‌న్‌ 3కి కూడా ఎన్టీఆర్‌నే హోస్ట్‌గా తీసుకోవాల‌ని నిర్వాహ‌కులు భావించారట‌. కాని ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం RRR ప్రాజెక్ట్‌ లో బిజీగా ఉండడంతో బిగ్ బాస్ ‌3ని ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌డం అసాధ్యం.
Read Also : ‘లక్ష్మీస్ ఎన్‌టీఆర్’ విడుదల వాయిదా: ప్రకటించిన వర్మ

నానినే కొన‌సాగిద్దామంటే సీజ‌న్‌ 2కి వ‌చ్చిన నెగెటివ్ ఇంపాక్ట్   సీజ‌న్‌ 3 పైన ప‌డుతుందేమోన‌ని మా యాజ‌మాన్యం భావిస్తుంద‌ట‌. ఇక మీలో కోటీశ్వ‌రుడు వంటి రియాలిటీ షోతో ఆక‌ట్టుకున్న నాగార్జుననే వారికి ఉన్న ఏకైక ఆప్ష‌న్‌గా క‌నిపిస్తుంది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ హోస్ట్ అనుభవాన్ని బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలోను ఉప‌యోగించి షోని మంచి హిట్ చేస్తార‌ని నిర్వాహ‌కులు అనుకుంటున్నార‌ట‌. ప్రస్తుతం ఆయ‌న‌తో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డం మొద‌లు పెట్టార‌ని త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంద‌ని టాక్.  

ఇక బిగ్ బాస్ సీజన్ 1 జూలైలో ప్రారంభం కాగా.. సీజన్ 2  జూన్‌లోనే ప్రారంభమైంది. అంటే ఒక నెల ముందే ప్రారంభమైంది. మరి సీజ‌న్ 3 ఎప్పుడు మొద‌ల‌వుతుంది, హోస్ట్‌గా ఎవ‌రు రాబోతున్నారు, ఎంత మంది సెల‌బ్రిటీలు ఇందులో పాల్గొంటారు తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
Read Also : శ్రీ దేవి బయోపిక్ లో బాలీవుడ్‌ హీరోయిన్‌!

×