Balakrishna : మీ బావకి పోటీ వస్తారని యాక్టింగ్ నుంచి తప్పుకోమన్నాడా??

ఈ ఎపిసోడ్ లో సినిమాలకి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలని మాట్లాడారు. బాలకృష్ణ అల్లు అరవింద్ ని ఉద్దేశించి.. మీ నాన్న గారు నటులు, మీరు కూడా కొన్ని సినిమాలు చేశారు, మరి ఎందుకని నటుడిగా తప్పుకొని నిర్మాత అయ్యారు. మీ బావకి పోటీ వస్తాడని తప్పుకోమన్నాడా....................

Balakrishna : మీ బావకి పోటీ వస్తారని యాక్టింగ్ నుంచి తప్పుకోమన్నాడా??

why allu aravind become a producer

Balakrishna :  ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 సక్సెస్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సీజన్ లో నాలుగు ఎపిసోడ్లు కాగా తాజాగా ఐదో ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఐదో ఎపిసోడ్ కి అగ్ర నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, అగ్ర దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి వచ్చారు. ఇటీవలే ఈ ప్రోమో రిలీజ్ చేయగా బాగా వైరల్ అవ్వడంతో ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. శుక్రవారం రాత్రి ఈ ఎపిసోడ్ ని ఆహాలో రిలీజ్ చేశారు.

ఈ ఎపిసోడ్ లో సినిమాలకి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలని మాట్లాడారు. బాలకృష్ణ అల్లు అరవింద్ ని ఉద్దేశించి.. మీ నాన్న గారు నటులు, మీరు కూడా కొన్ని సినిమాలు చేశారు, మరి ఎందుకని నటుడిగా తప్పుకొని నిర్మాత అయ్యారు. మీ బావకి పోటీ వస్తాడని తప్పుకోమన్నాడా అని అడిగారు. అల్లు అరవింద్ దీనికి సమాధానమిస్తూ.. ”నాన్న నన్ను యాక్టర్ అవ్వమన్నారు. నిర్మాత అయితే మనం డబ్బులు పెట్టాలి. వస్తే రావొచ్చు లేకపోతే పోవచ్చు. నష్టం కూడా ఉంటుంది. యాక్టర్ అయితే తీసుకోవడమే కానీ పెట్టడం ఉండదు అని చెప్పారు. కానీ నాకు ఒకరి దగ్గర పనిచేసి డబ్బులు తీసుకోవడం కంటే కొంతమందికి పని ఇచ్చి డబ్బులు ఇవ్వడం ఇష్టం అందుకే నిర్మాత అయ్యాను అని చెప్పారు. మా బావతోనే నేను ఎక్కువ సినిమాలు తీశాను” అని అన్నారు.

Ram Charan : మరో ఘనతను అందుకున్న మెగా పవర్ స్టార్..

ఇక బాలకృష్ణ సురేష్ బాబుని ఉద్దేశించి.. రామానాయుడు గారు నాకు ఒకసారి చెప్పారు, వెంకటేష్ మంచోడు అందుకే నటుడ్ని చేశాను. సురేష్ బాబు తెలివైన వాడు అందుకే నిర్మాత చేశాను అన్నారు. సురేష్ బాబు కూడా దీనికి సమాధానమిస్తూ.. మా సురేష్ ప్రొడక్షన్ లోగో SPలో దాని పైన ఉండే ఇద్దరం నేను, వెంకటేష్. మరి నాన్న అప్పుడే డిసైడ్ అయ్యారేమో S మీద వెంకటేష్ ఫోటో, P మీద నా ఫోటో పెట్టారు. S అంటే స్టార్, P అంటే ప్రొడ్యూసర్ అని నేను అనుకునే వాడ్ని అని తెలిపారు.