Tollywood : ఆడియన్స్ థియేటర్స్ కి ఎందుకు రావట్లేదు??

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించడం మాత్రం కత్తి మీద సాముగా మారింది. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది ? సినిమాకే సినిమా కష్టాలు రావడానికి కారణం ఎవరు?

Tollywood : ఆడియన్స్ థియేటర్స్ కి ఎందుకు రావట్లేదు??

Theaters

Tollywood :  సినిమాలో హీరో అంటే అన్ని సమస్యలకు సింగిల్ సొల్యూషన్. తాను ఏది అనుకుంటే అది సాధిస్తాడు. విలన్స్ ను ఒంటి చేత్తో రఫ్ ఆడిస్తాడు. తన హీరోయిజంతో కథకు శుభం కార్డు కూడా వేసేస్తాడు. అయితే సిల్వర్ స్క్రీన్ పై హీరో గారు ఎన్ని వేషాలు వేసినా ఆయన డాబు మొత్తం తెరమీదే. బొమ్మ పడిన తర్వాత ప్రేక్షకుడిని సీటులో కూర్చోపెట్టి వాహ్ అనిపించడంలో మాత్రం మన హీరో బొక్కాబోర్లా పడుతున్నాడు. ప్రేక్షకులను థియేటర్ కు రప్పించడం మాత్రం వాళ్లకు కత్తి మీద సాముగా మారింది. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది ? సినిమాకే సినిమా కష్టాలు రావడానికి కారణం ఎవరు?

ఇటీవల చాలా మంది నిర్మాతలు ఆడియన్స్ థియేటర్ కి రావట్లేదు. సినిమాలు హిట్ అయినా కలెక్షన్లు రావట్లేదు, ఇక ఫ్లాప్ సినిమాల పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాలేదు అని అంటున్నారు. దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి అగ్ర నిర్మాతలే ఆడియన్స్ థియేటర్ కి రావడంలేదు, హీరోలు కూడా ప్రమోషన్స్ ఎక్కువగా చేయాలి, టికెట్ రేట్లు తగ్గించాలి అంటున్నారు. ఆడియన్స్ థియేటర్స్ కి రాకపోవడానికి ముఖ్యకారణాలు ఒకటి టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం, మరోటి సినిమా ఓటీటీలో త్వరగా రావడం.

ప్రేక్షకులను ఈమధ్య కాలంలో టికెట్ రేట్ ఎక్కువగానే భయపెడుతోంది. టికెట్ రేట్ అందరికీ అందుబాటులో ఉన్నప్పుడే థియేటర్లు కళకళలాడుతాయి. పదే పదే రిపీటెడ్ ఆడియెన్స్ తో సినిమా కళకళలాడుతుంది. కానీ భారీ బడ్జెట్ అన్న పేరుతో రేట్ పెంచుకుంటూ పోతుంటే హాళ్లకొచ్చే ఫ్యామిలీ ఆడియెన్స్ సంఖ్య తగ్గిపోతుంది. దీంతో మొన్నటివరకు టికెట్ రేట్లు పెంచిసిన వాళ్ళే ఆడియన్స్ రావట్లేదని టికెట్ రేట్లు తగ్గించాము థియేటర్ కి రండి అని ప్రమోట్ చేసుకుంటున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

కరోనా పాండమిక్ కారణంగా గత రెండేళ్లలో సినీ సినారియో మారింది. థియేటర్స్ మూసేయడంతో ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులను ఓటీటీలు అట్రాక్ట్ చేసాయి. అప్పటివరకు బిగ్ స్క్రీన్ లోనే సీన్స్ ఎంజాయ్ చేయాలనుకున్న ఆడియెన్స్ ఓటీటీ స్మాల్ స్క్రీన్ తోనూ సరదాగా గడిపేయడం అలవాటు చేసుకున్నారు. ఇంకేముంది ఇప్పుడా ఓటీటీ అసలుకే ఎసరు తెచ్చేస్తోంది. సినిమా రిలీజ్ అయిన నెలకే ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా అని ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లడమే మానేస్తున్నారు. ఫ్లాప్ సినిమాలైతే రెండు వారాలకే ఓటీటీలోకి వస్తున్నాయి.

Tamannaah Bhatia : ఐఫా వేడుకల్లో తమన్నా తళుకులు

భారీ బడ్టెట్ సినిమాలని మాత్రమే ప్రేక్షకుడు కోరుకోవట్లేదు. రొటీన్ రొడ్డకొట్టుడు జమానాను వదిలేయమంటున్నాడు. ఇన్నోవేటివ్ గా, క్రియేటివ్ గా మేకర్స్ ని సినిమాలు తీయమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అందుకే గతంలో పెద్ద హీరో సినిమా ఫ్లాప్ అయినా ప్రొడ్యూసర్స్ నష్టాల నుంచి గట్టెక్కేవారు. సోషల్ మీడియా వాడకం పెరిగాక మొదటి ఆటతోనే విషయం తేలిపోతుంటే బుక్ చేసుకున్న టికెట్స్ ను కూడా వెంటనే క్యాన్సిల్ చేసేస్తున్నారు. మరి ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించడానికి మేకర్స్, చిత్ర పరిశ్రమ ఏం చేస్తుందో చూడాలి.