Balagam Movie: మూడు వారాల్లోనే ఓటీటీలో బలగం.. అసలు మ్యాటర్ ఇదేనా..?

ఇటీవల బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ‘బలగం’ మూవీ మంచి ప్రేక్షకాదరణతో దూసుకెళ్తోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇక ఇప్పుడు మరోసారి అందరికీ షాకిస్తూ, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేయడంతో, మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా బలగం మూవీ నిలిచింది.

Balagam Movie: మూడు వారాల్లోనే ఓటీటీలో బలగం.. అసలు మ్యాటర్ ఇదేనా..?

Why Balagam Movie Released Early In OTT

Balagam Movie: టాలీవుడ్‌లో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన మూవీ ‘బలగం’. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను కమెడియన్ వేణు డైరెక్ట్ చేసిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎమోషనల్ కంటెంట్‌‌తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

Balagam Movie: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన బలగం.. అంత లేదంటూ ట్వీట్ చేసిన హీరోహీరోయిన్!

ఇక వసూళ్ల పరంగానూ ‘బలగం’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇప్పటికే రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నిర్మాతలకు ప్రాఫిట్స్‌ను అందించింది. ఇటీవల థియేటర్లలో బడా సినిమాలు ఏమీ లేకపోవడంతో బలగం సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే, ఈ సినిమా ఎవరూ ఊహంచని విధంగా గతరాత్రి నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంకా థియేటర్లలో మంచి ఆదరణతో దుసుకెళ్తున్న బలగం మూవీని ఇంత సడెన్‌గా ఎందుకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారా అని అందరూ చర్చించుకుంటున్నారు.

ఈ సినిమాను ఇంత త్వరగా ఓటీటీలో తీసుకురావడానికి బలమైన కారణమే ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. చిన్న సినిమాగా తెరకెక్కిన ‘బలగం’ను నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫాంపై రిలీజ్ చేయాలని తొలుత భావించారట. కానీ, థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు దిల్ రాజు ముందుకు రావడంతో, ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ను తప్పించుకుంది. అప్పటికే ఈ సినిమాకు మంచి క్రేజీ రేటును ఆఫర్ చేశారట ఓటీటీ నిర్వాహకులు.

Balagam Movie: అర్ధరాత్రి సర్‌ప్రైజ్ ఇవ్వనున్న ‘బలగం’ మూవీ..!

ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద వచ్చిన రెస్పాన్స్‌ను చూసి మరికొంత మొత్తాన్ని మేకర్స్‌కు ఇచ్చి, ఈ సినిమాను ముందుగా అనుకున్నట్లుగానే ఓటీటీలో రిలీజ్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా బలగం లాంటి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని థియేటర్లలో ఇంకా రన్ అవుతున్న సినిమా, ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేయడంతో, ఇకపై థియేటర్లలో ఈ సినిమాను చూసేవారి సంఖ్య తగ్గడం మాత్రం ఖాయమని పలువురు కామెంట్ చేస్తున్నారు.