Venkatesh: వెంకీలో ఈ మార్పు ఏమిటి.. ఫ్యామిలీ హీరో నుండి అడల్ట్ కంటెంట్ హీరోగా ఎందుకు మారాడు?

ఒకప్పుడు టాలీవుడ్‌లో ఫ్యామిలీ చిత్రాల హీరో ఎవరంటే ప్రేక్షకుల నుండి ఠక్కున వచ్చే పేరు విక్టరీ వెంకటేష్. అంతలా తన సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు ఈ స్టార్ హీరో. ఎలాంటి వివాదాలకు అవకాశం ఇవ్వకుండా, తనదైన సినిమాలు చేస్తూ వెళ్లిన వెంకటేష్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు. దీనికి కారణం ఆయన నటించిన ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్. తొలిసారి తన కెరీర్‌లో ఓ వెబ్ సిరీస్‌లో నటించిన వెంకీ, ఇందులో మరో హీరో రానా దగ్గుబాటి తండ్రి పాత్రలో నటించాడు.

Venkatesh: వెంకీలో ఈ మార్పు ఏమిటి.. ఫ్యామిలీ హీరో నుండి అడల్ట్ కంటెంట్ హీరోగా ఎందుకు మారాడు?

Why Venkatesh Moved From Family Hero To Adult Content Hero

Venkatesh: ఒకప్పుడు టాలీవుడ్‌లో ఫ్యామిలీ చిత్రాల హీరో ఎవరంటే ప్రేక్షకుల నుండి ఠక్కున వచ్చే పేరు విక్టరీ వెంకటేష్. అంతలా తన సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు ఈ స్టార్ హీరో. ఎలాంటి వివాదాలకు అవకాశం ఇవ్వకుండా, తనదైన సినిమాలు చేస్తూ వెళ్లిన వెంకటేష్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు. దీనికి కారణం ఆయన నటించిన ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్. తొలిసారి తన కెరీర్‌లో ఓ వెబ్ సిరీస్‌లో నటించిన వెంకీ, ఇందులో మరో హీరో రానా దగ్గుబాటి తండ్రి పాత్రలో నటించాడు.

Venkatesh : ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ చేశాను.. రానాకి ఎదురుగా నటించాలంటే కష్టమే..

అయితే ఈ వెబ్ సిరీస్‌లో చాలా వరకు బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్ ఉండటమే ఇప్పుడు దీని విజయానికి కారణంగా నిలిచింది. ఇద్దరు ఫేం ఉన్న హీరోలు ఇలాంటి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తారని ఎవరూ ఊహించలేదు. ముఖ్యంగా ఫ్యామిలీ హీరోగా ముద్ర వేసుకున్న వెంకటేష్ లాంటి వారు ఇలాంటి సబ్జెక్ట్‌తో ఆడియెన్స్‌ను షాక్ చేశాడని చెప్పాలి. అయితే వెంకటేష్‌లో ఈ మార్పుకు గల కారణం ఏమై ఉంటుందా అని ఆయన డైహార్డ్ ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. కాగా, ఈ వెబ్ సిరీస్‌లో వెంకీ యాటిట్యూడ్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తన పాత్రలోని యాటిట్యూడ్ నచ్చే వెంకీ ఈ వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పి ఉంటాడని పలువురు భావిస్తున్నారు.

Venkatesh: హిందీలో వార్నింగ్ ఇచ్చిన వెంకీ.. క్యా బాత్ హై అంటోన్న ఫ్యాన్స్..!

కాగా, ఇప్పుడు ఈ యాటిట్యూడ్ తన నెక్ట్స్ మూవీకి కూడా బాగా కలిసొచ్చే విధంగా ఉందని తెలుస్తోంది. వెంకీ నటిస్తున్న నెక్ట్స్ మూవీని దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాకు ‘సైంధవ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇందులోనూ హీరో పాత్ర చాలా రఫ్‌గా, ఎవరినీ లెక్కచేయని యాటిట్యూడ్‌తో ఉంటుందట. రానా నాయుడులో వెంకీ పాత్రకు సైంధవ్‌లోని హీరో పాత్రకు చాలా దగ్గర పోలికలు ఉంటాయట. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఈ లెక్కన రానా నాయుడు‌లో వెంకీ చేసిన పాత్ర తన నెక్ట్స్ మూవీకి రిహార్సల్‌గా ఉపయోగపడుతుందని కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా వెంకీ లాంటి హీరో రానా నాయుడు లాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్‌లో నటించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు.